వార్తలు

Drones Importance in Agriculture: వ్యవసాయంలో డ్రోన్ ల ప్రాముఖ్యత

1
Agriculture Drones
Agriculture Drones

Drones Importance in Agriculture: వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికరంగం దినదినాభివృద్ధి చెందుతుంది. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త అభివృద్ధులు యంత్రాలు తయారవుతున్నాయి. వ్యవసాయంలో పనులని సులభంగా చేసే నూతన పరికరమే ఈ డ్రోన్. డ్రోన్ వినేందుకు కొత్త పదంలా అవలంబిస్తునా వ్యవసాయంలో వీటి ప్రాముఖ్యత అమోఘం. వ్యవసాయ డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంట ఉత్పత్తిని పెంచడానికి మరియు పర్యపరీక్షించడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఉన్న అధునాతన సెన్సర్స్ మరియు డిజిటల్ ఇమేజ్ ద్వారా రైతులు తమ పొలం యొక్క చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని, చీడపీడల గురించి తెలుసుకోవడానికి రైతులు మరియు వ్యవసాయ నిపుణులు పారిశ్రామిక రోడ్లమీద ఆధారపడుతున్నారు.

Agriculture Drones

Agriculture Drones

డ్రోన్ యొక్క పరికరాలు మరియు అది ఎలా పనిచేస్తుంది:

పైలెట్ కంట్రోలర్, రెక్కలు,చార్జర్, బ్యాటరీలు, కెమెరాలు,నాజిల్స్, మెమొరీ కార్డులు, టాబ్లెట్, క్లౌడ్ ప్రాసెసింగ్ సమాచారం పంపే సాఫ్ట్ వేర్ అవి ప్రాథమిక పరికరాలు మైక్రో ఎలక్ట్రో కంప్యూటర్లు, డిజిటల్ రేడియో డ్రోన్ లలో నూతనత్వాలు 3 లీటర్ల సామర్ధ్యం ఉండే డ్రోన్ 1.5 లక్షరూపాయిలు మరియు 5 లీటర్లు సామర్థ్యం అయితే 3 లక్షలు మరియు 20 లీటర్ల సామర్థ్యం అయితే 6 లక్షల వరకూ ధర ఉంటుంది. 10 లీటర్ల ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్లతో ఒక ఎకరానికి 6 నుండి 10 నిమిషాలలో గంటకు 0.5 నుండి 1.0 మీటర్ పంట మీద పిచికారీ చేయవచ్చు.

Also Read: Green Manure Importance: సేంద్రీయ వ్యవసాయం లో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత

వ్యవసాయ డ్రోన్ తో పిచికారి తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు 90 శాతం నీటిని మరియు 95 శాతం సమయాన్ని ఆదా చేయవచ్చు. డ్రోన్స్ పైలెట్ కంట్రోలర్ మొబైల్ యాప్ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. మనకు కావలసిన నిర్దిష్ట ప్రాంతంలో వైమానిక ఇమేజింగ్ మ్యాపింగ్ ద్వారా నడిపించవచ్చు.

డ్రోన్స్ ఉపయోగములు:

ఈ వ్యవసాయ డ్రోన్ లో రోజుకి 50 నుండి 100 ఎకరాలు పిచికారీ చేయగలదు. ఇది మామూలు పద్ధతిలో మనం పిచికారి చేసినట్లయితే కేరళ తో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. పంటల్లో పురుగులు తెగుళ్లు తాకిడి ఎక్కువ అయినప్పుడు వెంటనే పురుగు మందులు పిచికారీ చేయడానికి కూలీల కొరత ఎక్కువ అయినది అటువంటి సమయంలో మనకు డ్రోన్స్ ఎంతగానో సహాయపడుతుంది 10 మంది చేసే పనిని డ్రోన్ ఒకటే చేస్తోంది.

డ్రోన్ లతో పిచికారి చేయడం వలన నీరు,మందు సమయం చాలా వరకూ ఆదా అవుతుంది. పిచికారి కోసం ఎక్కువ నీరు పురుగు మందు వాడాల్సిన అవసరం లేదు. పురుగుమందులు మరియు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు వచ్చే విషవాయువు ప్రభావం నుండి మరియు గుండెపోటు నుండి ఈ వ్యవసాయ డ్రోన్లు రైతులకు రక్షణనిస్తాయి. డ్రోన్ లు వలన మరో సౌలభ్యం కూడా ఉంది మొబైల్ యాప్ జిపిఎస్ ల్యాండ్ మాప్పింగ్ ద్వారా పొలం సర్వే నెంబర్లు విస్తీర్ణం పెరగడంతో పాటు నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలు అన్నింటిని సమానంగా మందు ని ఎగురుతూ చెల్లుతుంది. డ్రోన్ కి అనుసంధానం చేసే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పొలంలో కావలసిన చోట డ్రోన్ కెమెరా ని తిప్పుతూ ఫోటోలు దృశ్యాలు కూడా చేయవచ్చు.

డ్రోన్స్ వలన ప్రతికూలతలు

డ్రోన్స్ ని ఉపయోగించడానికి ప్రాథమిక జ్ఞానం మరియు నైపుణ్యం అవసరం ఉంటుంది.
డ్రోన్స్ ని కొనుగోలు చేయుటకు ఖరేదైనవి.
డ్రోన్ ని ఉపయోగించడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి.
ప్రతికూల వాతావరణం సంభవించినప్పుడు డ్రోన్ ని ఎగరవేయడం కష్టం.
డ్రోన్స్ ఏ కారణం చేతనైనా పని చేయకపోతే వాటిని రిపేరు చేయించడం చేయించుకునే సదుపాయం. ప్రస్తుతానికి రైతులు యందు అందుబాటులో లేదు.

  • డా .పి అమర జ్యోతి, శాస్త్రవేత్త,సేద్యవిభాగం, 8309347119
  • డా.బి.మౌనిక, శాస్త్రవేత్త, వాతావరణ, 8074730775
  • జి .నవీన్ కుమార్, ఎస్ ఆర్ ఎఫ్, నిక్రా పథకం, 9569659389
  • డా .డి.చిన్నం నాయుడు, సమన్వయ కర్త, 9989623822                                                   కృషి విజ్ణాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా

Also Read: Israel Innovations: ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు ప్రపంచానికి అవసరం

Leave Your Comments

Green Manure Importance: సేంద్రీయ వ్యవసాయం లో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత

Previous article

YSR Rythu Bharosa-PM Kisan: మే16 న రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ

Next article

You may also like