Environmental Impacts of Rice Cultivation: వర్షాకాలం మొదలు అవడంతో రైతులు ఎక్కువగా వరి పంట పండించాలి అని చూస్తుంటారు. రైతులు వరి పంట కోతలు హార్వెస్టర్ ద్వారా చేస్తున్నారు. హార్వెస్టర్ వరి పంటని కొస్తే వరి కొయ్యలని దాదాపు 5- 10 సెంటి మీటర్లు పై భాగంలో కట్ చేస్తుంది. హార్వెస్టర్ ద్వారా వరి పంట కొస్తే గింజలు తీశాక ఆ గడ్డిని పశువులకి కూడా తిన్నాడనికి ఉపయోగంగా లేదు.
వరి కొయ్యలు ఎక్కువగా పొలంలో ఉండటం ద్వారా కూడా మళ్ళీ పంటకి పొలం దున్నుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చేతుల ద్వారా పంటలని కొస్తే ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి వాడుకోవచ్చు. మిగిలిన వరి కొయ్యలు కూడా పొలంలో దున్నుకోవచ్చు. దున్నుకుంటే కూడా పొలంలో కలిసిపోతాయి.
Also Read: Foxtail Millet Cultivation: వర్షాధార కొర్రసాగులో అధిక దిగుబడికి మెళకువలు.!

Environmental Impacts of Rice Cultivation
కానీ ఎక్కువ మంది రైతులు పంట కోతలు తర్వాత గడ్డిని కాల్చుతున్నారు. వరి పంట ద్వారా వాతావరణంలో మీథేన్ ఎక్కువ శాతంలో విడుదల అవుతుంది. అది కాకుండా గడ్డి కాల్చడం వల్ల వాతావర్ణంలో ఎక్కువ కాలుష్యం విడుదలు అవుతుంది. గడ్డి కాల్చడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి. నెల నాణ్యత కూడా తగ్గుతుంది.
వరి గడ్డి కాల్చకూడదు అని ఉత్తర భారత దేశంలో చేట్టాలు కూడా వచాయి. అక్కడి ప్రాంతాల్లో కాలుష్యం పెరగటం వల్ల ప్రభుత్వం రైతులకి వరి గడ్డి కాల్చకూడదు అని రూల్ పెట్టింది. ఒక ఎకరం గడ్డి కలిస్తే 10 వేల వరకు జరిమానా విధించింది. ప్రభుత్వం అని ప్రాంతాల్లో కూడా ఇలాంటి రూల్ ఉంటే ప్రాణియవర్ణానికి, పంట నేలని కాపాడుకోవచ్చు.