ఆంధ్రప్రదేశ్వార్తలు

వర్షాధార పంటలు సాగుచేసే రైతులు ఈ సూచనలు పాటించండి !

0

Weather Report : అత్యల్ప వర్షపాత మండల పరిధిలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో జూన్ 17,18 వ తేదీల్లో తేలికపాటి వర్షపాత సూచనలున్నాయి.గరిష్ట ఉష్ణోగ్రత 32.4 – 34.2° డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23.8 – 24.7 డిగ్రీల సెల్సియస్ నమోదుకావచ్చు.నైరుతి దిశగా గాలులు గంటకు 6.0 కి.మీ వేగంతో వీచే అవకాశముంది.గాలిలో తేమ ఉదయo పూట 73–80 శాతం,మధ్యాహ్నం పూట 62–72 శాతం నమోదయ్యేఅవకాశం ఉంది.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు :
1. రైతులు తేలికపాటి నేలల్లో వాలుకు అడ్డంగా దున్ని పంటలను విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్య మవుతుంది.వర్షాధారంగా సాగు చేసే పొలాల్లో అంతర పంటలు వేసుకోవాలి.ఆరుతడి పంటలను బోదె,సాళ్ళ పద్దతి లేదా ఎత్తు మడుల పద్దతిలో విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది అదే విధంగా ఎక్కువ వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయటానికి వీలుoటుoది.పొలం గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టడానికి ప్రధాన పంటలైన వరి,
మొక్కజొన్న,జొన్న,పెసర,కంది,వేరుశనగ,విత్తనాలను తెగుళ్ళ మందులతో
విత్తన శుద్ధి చేసుకోవాలి.
2. వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరుగా జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలగు పచ్చిరొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకొని నాట్లు వేసే ముందు భూమిలో కలియదున్నాలి.
3. పత్తి విత్తుటకు ఎర్ర నేలల్లో జూన్ మాసం నుండి జూలై 15, నల్లరేగడి నేలల్లో జులై నుండి ఆగష్టు 15 వరకు అనుకూలo. ఒక ప్రాంతంలోని రైతులంతా దఫాలుగా కాకుండా ఒకేసారి వీలయిoత స్వల్ప వ్యవధిలో విత్తుకోవాలి. బీటి పత్తి విత్తన మోతాదు ఎకరాకు 0.75 నుండి 1.0 కిలోలు. బీటి పత్తి చుట్టూ నాన్ బీటి/కంది వేసుకోవడం వలన కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది.సిఫారసు మేరకు దుక్కిలో ఎరువులు వేసుకోవాలి. విత్తుకున్న 40 రోజులకు తప్పనిసరిగా ఎకరానికి 4-6 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి.
4. ప్రస్తుతం పత్తి పంట మొలక దశ నుండి శాకీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరు కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు పైరు అన్ని దశల్లో కనిపిస్తుంది. దీని నివారణకు విత్తేతప్పుడు కిలో విత్తనానికి 10 గ్రా.ట్రైకోడెర్మ పొడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. ప్రస్తుతం తెగులు లక్షణాలు ఉన్న పొలంలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3.0 గ్రా./ లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల చుట్టూ వేరు మండలం తడిచేలా పోయాలి.
5. ఆముదం విత్తటానికి జూన్ 15 నుండి జూలై 31 అనుకూల సమయం.ప్రస్తుతం నేలలో అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని దుక్కులు చేసుకోవాలి. కాలానికి, నేలకు, ప్రాంతానికి అనువైన  రకాలను వేసుకోవాలి. సూటి  రకాలు: హరిత, కిరణ్, జ్వాల, ప్రగతి. సంకర రకాలు: డి.సి.హెచ్. 117, పి. సి.హెచ్. 111, జి.సి.హెచ్.8 ఐ.సి.హెచ్. 66,ఐ.సి.హెచ్. 5 రకాలను ఎంపిక చేసుకోవాలి.
6. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఆవు, గేదేలలో గాలికుoటూ, ఎంటారోటాక్సీమియా,పారుడు రోగo వ్యాప్తికి అనుకూలం. రైతులు
తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
7. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న,
మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు.తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో
పశుగ్రాస పంటలుగా సజ్జ,బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు.

డా. బి. సహదేవ రెడ్డి,
డా. జి. నారాయణ స్వామి, డా. జి.డి. ఉమాదేవి,
వ్యవసాయ పరిశోధన స్థానం,అనంతపురం

Leave Your Comments

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 నుండి 14 వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది ?

Previous article

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు

Next article

You may also like