వార్తలువార్తలు

Minister Atchannaidu: టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు కృషి – మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

0
Minister Atchannaidu

Minister Atchannaidu: నేటినుంచి కిలో టమాట రూ.50/-లకే విక్రయం…మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

  • రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
  • టమాటా, ఉల్లి ధరల పెరుగుదల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు.


రైతుల నుంచి నేరుగా టమాట, ఉల్లి సేకరణ !
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి నేరుగా టమాట, ఉల్లి సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. టమాట 1.35 లక్షల కిలోలు, ఉల్లి 21 వేల కిలోలు రైతుల నుంచి సేకరించి వాటిని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సాధారణ ధరలకు టమాట, ఉల్లి విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే ధరల పట్టిక తప్పని సరిగా ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

నేటినుంచి కిలో టమాట రూ.50/-లకే విక్రయాలు:

  • 13 జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా మంగళవారం (అక్టోబర్ 8) నుంచి రాయితీపై కిలో టమాట రూ.50 లకే విక్రయాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం నుంచి జిల్లా అధికారుల పర్యవేక్షణలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 50 శాతం రాయితీపై మార్కెటింగ్ శాఖ టమాట విక్రయాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
  • టమాట ధర పెరిగిన నేపథ్యంలో సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Leave Your Comments

Natural Farming: ప్రకృతి వ్యవసాయంతో రైతుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుదాం …వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్

Previous article

Deputy Chief Minister Pawan Kalyan: పర్యావరణ, వన్య ప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం … ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Next article

You may also like