గత మూడు రోజుల వాతావరణం :-
గడిచిన మూడు రోజులలో రాష్ట్రం లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు ,మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి . పగటి ఉష్ణోగ్రతలు 29 – 40 డిగ్రీల సెల్సియస్ మరియు రాష్ట్ర ఉష్ణోగ్రతలు 20 – 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి .
రాబోవు ఐద రోజుల వాతావరణ విశ్లేషణ (ఈ రోజు మధ్యాహ్నం 13:00 గంటల ఆధారంగా )
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రం లో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు 31 – 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 – 27 డిగ్రీల సెల్సియ సూచనలున్నాయి .
హెచ్చరిక :-
మొదటిరోజు :- రాష్ట్రంలోని ఆదిలాబాద్ ,నిర్మల్ , నిజామాబాద్ , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , వికారాబాద్ ,సంగారెడ్డి , మెదక్ ,కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రాలోని కొమరం భీం ,ఆసిఫాబాద్ , మంచిర్యాల ,కరీంనగర్ ,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి , ములుగు ,భద్రాద్రి , కొత్తగూడెం ,ఖమ్మం ,యాదాద్రి , భువనగిరి ,రంగారెడ్డి ,హైదరాబాద్ ,మేడ్చల్ ,మల్కాజ్గిరి , మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ ) తో కూడిన వర్షాలు కురిసే అవకాశం సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలో నల్గొండ ,సూర్యాపేట , మహబూబ్ నగర్ ,వరంగల్ , హనుమకొండ , జనగాం ,సిద్దిపేట్ ,నాగర్ కర్నూల్ ,వనపర్తి ,నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 – 40 కి. మీ ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి .
రెండో రోజు :- రాష్ట్రంలోని నిర్మల్ ,నిజామాబాద్ ,జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి ,మెదక్ ,కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ. ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలోని ఆదిలాబాద్ , కొమరం భీం , ఆసిఫాబాద్ , మంచిర్యాల ,కరీంనగర్ ,పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి ,ములుగు ,సిద్దిపేట్, యాదాద్రి ,భువనగిరి , రంగారెడ్డి , హైదరాబాద్, మేడ్చల్ ,మల్కాజిగిరి ,వికారాబాద్ ,మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలోని భద్రాద్రి , కొత్తగూడెం ,ఖమ్మం, నల్గొండ ,సూర్యాపేట , మహబూబ్ నగర్ , వరంగల్ , హనుమకొండ ,జనగాం ,నాగర్ కర్నూల్, వనపర్తి ,నారాయణపేట ,జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి. మీ. ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి .
మూడో రోజు :- రాష్ట్రంలోని నిజామాబాద్ ,వికారాబాద్ , సంగారెడ్డి ,మెదక్ , కామారెడ్డి ,జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాళ్లు (గాలి వేగం గంటకు 40 – 50 కి.మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలోని ఆదిలాబాద్ ,కొమరం భీం,ఆసిఫాబాద్, నిర్మల్ ,జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల ,యాదాద్రి ,భువనగిరి ,రంగారెడ్డి ,హైదరాబాద్ ,మేడ్చల్, మల్కాజిగిరి ,మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ , వనపర్తి , నారాయణపేట్ , జోగులంబ , గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు ( గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ.) తో కూడిన వర్షాలకు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలో మంచిర్యాల ,కరీంనగర్,పెద్దపల్లి ,నల్గొండ ,సూర్యాపేట, మహబూబ్ నగర్ , వరంగల్ ,హనుమకొండ ,జనగాం ,సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలు (గాలి వేగం గంటకు 30 – 40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి .
నాలుగో రోజు :- రాష్ట్రంలోని రంగారెడ్డి ,హైదరాబాద్ ,మేడ్చల్ ,మల్కాజిగిరి ,వికారాబాద్, సంగారెడ్డి ,మహబూబ్ నగర్ ,నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ,ఖమ్మం ,నల్గొండ ,సూర్యాపేట ,మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ,జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్ ,కామారెడ్డి, వనపర్తి ,నారాయణపేట ,జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 – 50 కి. మీ) తో కూడి వర్షాలు కురిసే సూచనలున్నాయి . రాష్ట్రంలోని ఆదిలాబాద్ ,కొమరం భీం ,ఆసిఫాబాద్, మంచిర్యాల ,నిర్మల్ ,నిజామాబాద్ ,జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల ,కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ(గాలి వేగం గంటకు 30 – 40 కి. మీ) తో కూడి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి .
ఐదో రోజు :- రాష్ట్రంలోని ఆదిలాబాద్ ,కొమరం భీం ,ఆసిఫాబాద్ ,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల ,కరీంనగర్ ,పెద్దపల్లి ,సిద్దిపేట, మేడ్చల్, మల్కాజిగిరి , మెదక్ ,కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 కి. మీ) తో వేగంతో కూడి వర్షాలు కురిసే ఒక సూచనలున్నాయి . రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి ,ములుగు ,యాదాద్రి ,భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ ,వనపర్తి, నారాయణపేట , జోగులాంబ ,గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 కి.మీ )తో కూడి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి . రాష్ట్రంలోని భద్రాద్రి ,కొత్తగూడెం, ఖమ్మం ,నల్గొండ ,సూర్యాపేట ,మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట ,జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు ( గాలి వేగం గంటకు 30 40 కి మీ) తో కూడి వర్షాలు కురిసే సూచనలుఉన్నాయి .
వాతావరణా దారితే వ్యవసాయ సలహాలు :-
వర్షాధారపు పంటను సరైన సమయంలో వితుక్కోడానికి విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు సేకరించుకోవాలి.
వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రవస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు ,తెగుళ్ళకు చెందిన వివిధ దశలో భూమిలో ఉండి అవి బయటపడే అధిక ఉష్ణోగ్రతకు చనిపోతాయి . బయటపడిన ప్యూపాలను గుడ్లు, పక్షులు తిని నాశనం చేస్తాయి . ఇలా పలు విధాల మేలు కలగడమే గాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది . అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవిజలను ఆసరా చేసుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి . రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలుఉన్నందున రైతులు చెట్లు క్రింద నిలబడరాదు . మరియు పశువులు గొర్రెలు, మేకలు, చెట్ల క్రింద ఉంచరాదు. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు ,విద్యుత్ తీగలు, మరియు చెరువులు నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు నందున కోసిన పంటను (వరీ,మొక్కజొన్న ,శనగ,పెసరు ,మినుము, జొన్న ,ప్రొద్దుతిరుగుడు, నువ్వులు,మొదలగు పంటలు) ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాన్ని తరలించవలెను . మార్కెట్ కు తరలించిన దాన్యం తడవ కుండా “టార్పాలిన్” తో కప్పి ఉంచవలెను .
వర్షాలు కురిసే సూచన ఉన్నందున మామిడి మరియు కూరగాయల పంటలు కోసుకొని మార్కెట్కు తరలించవలెను .
వర్ష సూచన్నందున తాత్కాలికంగా పురుగుమందులు పిచికారి చేయడం వాయిదా వేసుకోవాలి. వేసవి జల్లులను ఉపయోగించుకొని పచ్చిరొట్ట పైరును విత్తు వేసుకోవడానికి విత్తనాలను సేకరించి పెట్టుకోవాలి.
Leave Your Comments