వార్తలు

ఉద్యానపంటల్లో శిక్షణకు తెలంగాణాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  

0

ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ,సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటల పెంపకంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం జేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు గురించి గత సెప్టెంబర్ 18 న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాశారు. దీనికి బదులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ద్వైపాక్షిక సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు మంగళవారం(నవంబర్ 5 న)లేఖ ద్వారా తెలియజేశారు.

అత్యాధునిక సాంకేతిక వనరులను సొంత నిధులతో ఏర్పాటు చేసుకోవడానికి ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఈ కేంద్రంలో ఉద్యానపంటలు సాగుచేసే రైతులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సహాయసహకారాలు అందించనున్నారు.

Leave Your Comments

పంటలను అశిస్తున్న చీడపీడలను ఎలా నివారించుకోవాలి ?  

Previous article

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముదంజ

Next article

You may also like