వార్తలు

Cluster Beans: వేసవిలో గోరుచిక్కుడు సాగు సస్యరక్షణ చర్యలు

0
Cluster Beans (Goru Chikkudu)
Cluster Beans (Goru Chikkudu)
Cluster Beans: గోరుచిక్కుడు వేసవి ఉష్ణోగ్రత లకు అనుకూలమైన పంట ఈ పంటను సాగు చేయడానికి అన్ని రకాల నేలలు ఇంకే స్వభావం  ఉండి నెల ఆమ్లగుణం 7.5 నుండి 8.0 వరకు ఉండాలి చౌడు నువ్వు ఈ కూరగాయ పంట తట్టుకోలేదు దక్షిణ భారతదేశంలో లేత కాయలను కూరగాయగా వాడతారు కొన్నిరకాల గోరు చిక్కుడు గింజల నుండి విలువైన తయారు చేస్తారు ఈ జిగురును బట్టల పేపరు సౌందర్యసాధనాల పరిశ్రమలలో మరియు నూనె పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా వాడతారు. ఈ జిగురును పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే పదార్థాలలో అబ్సార్‌బెంట్‌గా వాడతారు. బాగా కొమ్ములు పెరిగే గోరుచిక్కుడు రకాలను గింజలను పశువులు దాణాగా పచ్చిమేతగా వాడతారు. ఈ పంటను నేల, భౌతిక రసాయనిక లక్షణాలు పెంపొందించడానికి పచ్చి రొట్ట ఎరువుగా కూడా వాడతారు. మరియు ఔషధ తయారీలో కూడా వాడతారు.
Cluster Beans (Goru Chikkudu)

Cluster Beans (Goru Chikkudu)

పంటకాలం:
ఖరీఫ్‌: జూన్‌`జూలై, వేసవి జనవరి`ఫిబ్రవరి
రకాలు: పూస మౌసమి, పూసా సదా బహార్‌, పూసా నవ బహార్‌ మరియు ప్రైవేట్‌ కంపెనీ మేలైన రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి.
నేల తయారీ: భూమిని బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నులు మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఖరీఫ్‌ పంటకు 45 సెం.మీ. దూరంలో బోదెలు వేసుకోవాలి.
విత్తనం: ఎకరాకు 12 నుండి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మొదటిసారిగా గోరుచిక్కుడు పొలంలో వేసేటప్పుడు, విత్తడానికి ముందు నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియాను (200 గ్రా.) విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
ఎరువులు: ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని పూర్తి భాస్వరం పొటాష్‌ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మిగిలిన నత్రజని 30 నుండి 40 రోజులకు సరిపోయే తడిలో వేసుకోవాలి.
విత్తన శుద్ధి:
ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా. 1 కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత దీనికి ట్రైకోడెర్మావిరిడి 4 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

Also Read: సోయాచిక్కుడు లో ఎరువుల యాజమాన్యం

విత్తే దూరం:
ఖరీఫ్‌ పంటకి 60 సెం.మీ. దూరం చాళ్ళకి మధ్య, 15 సెం.మీ. మొక్కలకి మధ్య ఉండాలి. వేసవి పంటలు 45 సెం.మీ. దూరం చాళ్ళకి మధ్య 15 సెం.మీ. మొక్కలకి మధ్య ఉండేలా చూసుకోవాలి. వేసవి పంటలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి.
నీటి యాజమాన్యం: 
గింజలు విత్తగానే నీటి తడి ఇవ్వాలి. విత్తిన మూడవ రోజు మరలా తడి ఇవ్వాలి. ఆ తరువాత నీటి తడులకి 7 నుండి 10 రోజుల వ్యవధి అనుసరించాలి.
కలుపుయాజమాన్యం:
గింజలు విత్తడానికి ముందే బేసలిన్‌ కలుపు మందును 800 గ్రాముల మూల పదార్థం 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు సరియగు తేమలో నేలపై పిచికారీ చేసినచో 30 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. 35 రోజులకు ఒకసారి  దంతి నడిపితే సరిపోతుంది.
సస్యరక్షణ:
పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింద పేర్కొనబడిన చర్యలు పాటిస్తే గణనీయమైన దిగుబడులు సాధించవచ్చు.
పేనుబంక:
పెద్ద, చిన్న పురుగులు లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి.
నివారణ: డైమిథోయేట్‌ 2 మి.లీ  లేదా, మెటాసిస్టాక్స్‌ 2 మి.లీ. లేదా ఫాసలోన్‌ 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి పది రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: ఆకులపై తెల్లని పదార్థం ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైతే పసుపు రంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లేదా అజాక్స్‌ స్ట్రోమ్‌ 23 శాతం ఎస్‌ ఎస్‌ సి ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారీ చేయాలి.
ఆకు మచ్చ తెగులు: ఆకుల మీద నల్లని మచ్చలు వచ్చి, తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్‌ 2.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు: 
మొక్కలు నిలువుగా ఎండి చనిపోతాయి ట్రైకోడెర్మావిరిడి 100 కిలోల వేపపిండికి కలిపి ఆఖరి దుక్కిలో వేయాలి. నివారణకు పొలంలో నీరు నిలువకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాములు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేలంతా  పోయాలి.  పంట మార్పిడి పాటించాలి.
కోత: లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్‌కి పంపాలి. ముదిరిన కాయలలో నార (పీచు) శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో ధర పలుకదు.
దిగుబడి : 20 నుండి 25 క్వింటాళ్ల / ఎకరాకు
వరుగులతయారీ: 
గోరుచిక్కుడు కాయలను చిన్న ముక్కలుగా చేసి ఒక శాతం ఉప్పు ద్రావణంలో  ముంచి తీసి ఆరబెట్టాలి. ఎండిన వరుగులను గాలి తగలని డబ్బాలో లేదా పాలిథీన్‌ సంచులలో నిల్వచేయాలి.
దిగుబడి:
పొద రకాలు: కూరగాయ దిగుబడి 3.6 నుండి 4.0 టన్నులు ఎకరానికి
గింజ దిగుబడి: 0.6 నుండి 0.8 టన్నులు ఎకరానికి
తీగ రకాలు: కూరగాయల దిగుబడి 4.8 నుండి 6.0 టన్నులు ఎకరానికి దిగుబడి పొందవచ్చు
ఈ విధమైన మెళకువలను రైతు సోదరులు పాటించి తగిన దిగుబడులను సాధించవచ్చు.
డా.డి. స్రవంతి, ఎం. చరిత, డా.కె. శిరీష, కె. అంజలి, 
డా. కె. గోపాలకృష్ణమూర్తి మరియు ఎమ్‌. మాధవి, 
వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట
Leave Your Comments

Gooseberry Plants: ఉసిరిలో కనిపించే వ్యాధులు

Previous article

Gerbera Flowers Cultivation: జెర్బరా పూల సాగులో మెళుకువలు

Next article

You may also like