Meerabi Success story: గుంటూరు జిల్లా అరమాండ్ల గ్రామానికి చెందిన చుండూరు మీరాబీ (39), 2008లో వెలుగు ప్రాజెక్టులో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (CRP)గా ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం RySSలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణలో అపారమైన అనుభవం ఉన్న ఆమె రైతులతో కలిసిమెలిసి పని చేస్తూ రైతులు ఉత్తమ పద్ధతులను అనుసరించేలా మద్దత్తు ఇస్తున్నారు. మీరాబి స్వయంగా PMDS(Pre Monsoon Dry Sowing) లో 30 పంటలతో మోడల్ను రూపొందించి ప్రచారం చేసారు, తద్వారా ఆమె తన మోడల్పై నమ్మకం మరియు విశ్వసనీయతను పొందారు. ఇది RySSలో మొదటిది కావున RySS ఆమె ఆమె ప్రయత్నాలను గుర్తించి ఆ నమూనా కు ఏకంగా ‘మీరాబీ మోడల్’గా అభివర్ణించింది. ఆమె పేరుతో మోడల్ కు నామకరణం చేయడమే గాకుండా అదే పేరుతో రాష్ట్రం అంతటా ఈ నమూనాను విస్తరించింది.
ఈ నమూనా యొక్క ప్రయోజనం ఏమిటంటే 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పొలాలకు బయో ఇనాక్యులెంట్ల (జీవ ఎరువుల) అవసరం ఉండదు. సాగు ఖర్చు దాదాపు సున్నా అవుతుంది. సంప్రదాయ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఈ నమూనా లో నికర రాబడి చాలా ఎక్కువ. నేల ఆరోగ్యంలో కూడా మంచి మెరుగుదల ఉంటుంది మరియు ఈ నమూనాలో నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.
ఆమె తన వైవాహిక జీవితం ప్రారంభంలో చాలా ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆమె భర్తకి రసాయన వ్యవసాయ పొలాల్లో పని చేయడం మరియు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె NPM (Non Pest Management)ప్రాజెక్ట్ గురించి విని రైతుల్లో పరివర్తనకు ఎంతో కృషి చేసింది. ఆమె 2009 వ సంవత్సరంలో గ్రామ కార్యకర్తగా NPM ప్రాజెక్ట్లో చేరారు. అక్కడ 2012 వరకు కొనసాగారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రక్రియలో ఆమె నెల్లూరు జిల్లాలో CRP గా పనిచేశారు. 2019 సంవత్సరం నుండి ఆమె రైతు సాధికార సంస్థ (RySS) లో సబ్ డివిజనల్ యాంకర్ (SDA) గా పనిచేసారు. ఇప్పుడు ఆమె రాష్ట్రంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఆమె 14 సంవత్సరాల వ్యవధిలో కేవలం 10వ తరగతి అర్హతతో అట్టడుగు స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పదోన్నతి పొందారు.
మీరాబి తన ఎకరం భూమిలో రసాయనాలు వాడకుండా 2009 నుండి వ్యవసాయం చేసారు . 2015 నుంచి ప్రకృతి వ్యవసాయం పద్దతిని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన పొలంలో 3 రకాల కూరగాయలతో పాటు వరిని పండిస్తున్నారు. ఆమె ఒక ఎకరం భూమికి రూ. 19000/- మాత్రమే ఖర్చు చేసింది మరియు 1.5 లక్షల ఆదాయం పొందారు. ఆమె 2018 వ సంవత్సరం నుండి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఆర్థిక లాభంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని పాటించడం ద్వారా మరిన్ని ఆర్థికేతర ప్రయోజనాలను పొందుతున్నారు. పిఎమ్డిఎస్ను నిరంతరం పాటించడం ద్వారా మరియు బహుళ పంటలను పండించడం ద్వారా వారి పొలానికి బయోస్టిమ్యులెంట్ల అవసరం లేకుండా పోయింది. గత సంవత్సరం వారు తమ భూమి కోసం ఘన మరియు ద్రవ జీవామృతాలను వినియోగించలేదు. మీరాబి తమ పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా మంచి ధరకు విక్రయించడం ప్రారంభించారు.
పీఎండీఎస్లో 30 రకాల విత్తనాలతో కూడిన మీరాబీ మోడల్కు కూలీల అవసరం లేదు. డిబ్లింగ్ మరియు PMDS పద్ధతులు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పంటను రక్షించడంలో సహాయపడతాయి.
“ఇప్పటికి నా వ్యవసాయ క్షేత్రంలో మరియు చుట్టుపక్కల ఉన్న 15 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించాను. సందర్శకులు మరియు RySS అధికారుల నుండి మాకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి” అని మీరాబి తన మాటల్లో వ్యక్తపరిచారు”.
మీరాబీ కేస్ స్టడీ
గుంటూరు జిల్లా