Crops of Telangana: గత ఏడు సంవత్సరములలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా మరియు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాల సబ్సిడీలు వలన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలలో ప్రముఖ పాత్ర పోషించాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 19.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వడ్లు, 3.6 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2.53 మిలియన్ మెట్రిక్ టన్నుల పండ్లు, 2.49 మిలియన్ మెట్రిక్ టన్నుల కూరగాయలు, 0.3 మిలియన్ మెట్రిక్ టన్నుల పసుపు, 0.85 మిలియన్ మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి, 0.4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎండు మిరపకాయలు, 5.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు మరియు పాల ఉత్పత్తులు, 2.65 మిలియన్ మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు, 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతున్నది.
కావున పండిరచిన పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం ఒక సామెతను గుర్తు చేసుకోవాలి ‘‘ధాన్యం ప్రాసెసింగ్, ధాన్యం ఉత్పత్తికి సమానం’’ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా విలువలు జోడిరచి రైతులకు మంచి గిట్టుబాటు ధరతో పాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం మరియు గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, ఆహార ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆహారశుద్ధి పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయడం జరిగినది.
ఈ పాలసీ ద్వారా సుమారు 25,000 కోట్ల పెట్టుబడుల సాధన, 70 వేల మందికి ప్రత్యక్ష మరియు మరో మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేయనుంది. అంతేకాకుండా మొదటి దశ కింద 10 ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేయుటకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా ప్రత్యేక ప్రోత్సాహకాలను మరియు సబ్సిడీలను అందించి వ్యవసాయానికి మరియు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయనున్నది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా భారత ప్రభుత్వం లక్ష్యాలైన రైతుల ఆదాయం రెట్టింపు-2022 అనే లక్ష్యానికి మన రైతులు చేరువయ్యే అవకాశం ఉంటుంది. మన దేశంలో సుమారు 25 లక్షల చిన్న మరియు సూక్ష్మతరహా ఆహారశుద్ధి పరిశ్రమలు అసంఘటిత కుటీర పరిశ్రమలుగా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిశ్రమలను అధికారికంగా నమోదు చేసి వాటి ఆధునీకరణకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక మద్దతుతో పాటు, వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రధాన మంత్రి సూక్ష్మఆహార పరిశ్రమల అధికారికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి కేంద్రం వంటి విధానాలతో స్థానిక పంటలకు విలువ జోడిరచుట, రైతులకు గిట్టుబాటు ధర అందించడం, ఆయా ప్రాంత ప్రజలకు కావలసిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం, గ్రామీణ యువతి యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద స్కీంను ప్రారంభించడం జరిగినది.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే నినాదంతో ఒక జిల్లా ఒక క్లస్టర్‌గా భావించి ఆ జిల్లా లో ఉత్పత్తి చేసే ప్రధాన ఆహార పంటకు సంబంధించిన అగ్రికల్చర్ వ్యాల్యూచైను ను పటిష్ట పరిచి సమీకృత ఆహారం శుద్ధి పరిశ్రమలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచి రైతులకు మంచి గిట్టుబాటు ధరతో పాటు రైతులను తాము పండిరచే పంటకు విలువ జోడిరచే విధంగా ప్రోత్సహించడం. ఒక క్లస్టర్ ఒక జిల్లా దాటి కూడా విస్తరించవచ్చు.
కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మా లైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి సూక్ష్మ మరియు చిన్న తరహా ఆహారశుద్ధి మిల్లులు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుండి లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి నడుస్తున్నటువంటి పిండి మిల్లులు, కారం పొడి, పసుపు పొడి మిల్లులు, నూనె మిల్లులు, పప్పు మిల్లులు, మసాలా దినుసుల మిల్లులు, కూరగాయలు పండ్లు పరిశ్రమ, బేకరీలు, చిన్న తరహా చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, చిన్న తరహా మటన్ ప్రాసెసింగ్ యూనిట్, పచ్చళ్ళు తయారీ యూనిట్, తినుబండారాలు తయారుచేసే యూనిట్ మొదలైనటువంటి యూనిట్ యజమానులు పథకం కింద అప్లికేషన్ పెట్టుకుంటే వారి యూనిట్ సాంకేతిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి కోసం సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల ఉత్పత్తి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో 3 జిల్లాలు బియ్యం మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు,6 జిల్లాలు మిరపకాయ వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, 2 జిల్లాలు చిరుధాన్యాలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, 3 జిల్లాలు సోయాబీన్ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, 3 జిల్లాలు వేరుశెనగ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, 3 జిల్లాలు కూరగాయలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు, 3 జిల్లాలు పాలు మరియ విలువ ఆధారిత పాల ఉత్పత్తులు, 3 జిల్లాలు మామిడి కాయ మరియు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులు, 4 జిల్లాలు వివిధ రకాల తినుబండారాలు, స్నాక్స్ ఇన్స్టెంట్ ఫుడ్స్, మరో మూడు జిల్లాలలో బత్తాయిలు మరి నిమ్మజాతి పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, పసుపు దాని విలువ ఆధారిత ఉత్పత్తులు, చేపలు మరియు ఆక్వా ప్రొడక్ట్స్ వంటి ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
Also Read: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కోతుల బెడద
ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద తెలంగాణలో గుర్తించిన పంటలు….
ఉత్తర తెలంగాణ మండలం
జిల్లా: ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: సోయాబీన్ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: సోయాబీన్ నూనె, సోయా పాలు, పన్నీరు, మల్టీ గ్రీన్ ఆట, వివిధ మసాలా దినుసులలో ముడిసరుకుగా , సోయా సాస్, బలవర్ధకమైన చిన్న పిల్లల మాల్ట్ ఆహారం తయారు చేయడంలో , సోయా పట్టీలు, స్నాక్స్, ఇతర దినుసులతో ఎనర్జీ బార్స్ మొదలైనవి తక్కువ ఖర్చుతో కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవచ్చు.
జిల్లా : జగిత్యాల, మంచిర్యాల
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: మామిడి కాయ మరియు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు : పచ్చి మామిడి కాయలతో ఆంచూర్ పౌడర్, మామిడికాయ పచ్చడి, మామిడి పండు జ్యూస్, మామిడిపండు లెదర్ బార్, మామిడిపండ్ల రిపెనింగ్ చాంబర్, మామిడిపండ్ల జమ్, జెల్లీ, గుంజెళ్ళీస్ మొదలైన చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం.
జిల్లా : కరీంనగర్, పెద్దపల్లి
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: బియ్యము మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: సాధారణ బియ్యం, దంపుడు బియ్యం, కలర్ రైస్, బ్రౌన్ రైస్ మరియు వాటి విలువ ఆధారిత పదార్థాలు, బియ్యం పిండి, రవ్వ అటుకులు, మురుమురులు, ఇన్స్తాంట్ రైస్ పదార్థాలు: బిర్యానీ రైస్, కిచిడి, సాంబార్ రైస్, మసాలా రైస్, వెజిటేబుల్ రైస్. లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ఆధారిత విలువ ఉత్పత్తులు, రైస్ బ్రాన్ ఆయిల్, స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ మిక్స్, స్వీట్ మొదలైన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ముడిసరుకు అందుబాటులో ఉంటుంది.
జిల్లా : కొమరంభీమ్ ఆసిఫాబాద్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: చిరుధాన్యాలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: చిరుధాన్యాలు, పొట్టు తీసిన చిరుధాన్యాలు, చిరుధాన్యాల ఉప్మా రవ్వ, మల్టీ గ్రీన్ ఆట, చిరుధాన్యాల ఇడ్లీ, దోస రవ్వ, చిరుధాన్యాల అటుకులు, చిరుధాన్యాలతో సత్తుపిండి, చిరుధాన్యాల తో బిస్కెట్లు, కేకులు, బ్రెడ్, పాస్తా, వెర్మీసలి, పాయసం, మొలకెత్తిన చిరుధాన్యాల మాల్ట్ , చిరుధాన్యాల స్నాక్స్, చిరుధాన్యాల తో వివిధ రకాల ఇన్స్టంట్ ఫుడ్స్ మొదలైన వాటిని తక్కువ ఖర్చుతో మిషనరీ వాడి తయారు చేసుకోవచ్చు.
జిల్లా : నిజామాబాద్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: పసుపు దాని విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: పసుపు పొడి, కర్కుమినాయిడ్స్, కర్క్యుమిన్, పసుపు నూనె, పసుపు ఒలియోరెసిన్, ఎన్‌క్యాప్సులేటెడ్ నూనెలు మరియు పొడులు. పసుపు మిల్లు తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు మిగతా వాటికి అధిక పెట్టుబడి అవసరం ఉంటుంది. కరోనా తర్వాత పచ్చి పసుపు తో తయారుచేసే రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారపదార్థాలకు ఎక్కువగా డిమాండ్ పెరిగింది. వివిధ సౌందర్య లహెనాల తయారు చేయడంలో పసుపు దాని విలువ ఆధారిత పదార్థాలను విరివిగా ఉపయోగిస్తారు.
జిల్లా : రాజన్న సిరిసిల్ల
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: చేపలు మరియు ఆక్వా ప్రొడక్ట్స్ విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: ఆక్వా ప్రొడక్ట్స్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్, మినిమల్ ప్రాసెసింగ్, కాన్నిగ్ ఫుడ్స్, ఎండ పెట్టే యంత్రాలు వంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆదాయం పెంచుకోవచ్చు
సెంట్రల్ తెలంగాణ మండలం
జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: మిరపకాయ వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: మార్కెట్ డిమాండ్ ఉన్న మంచి గాడత, రంగు నాణ్యతా ప్రమాణాలు కలిగిన రకాలను పండిరచి వాటిని తగిన మోతాదులో వివిధ రకాలను కలిపి మిరప పొడి తయారు చేసి
అమ్మితే మంచి లాభం వచ్చును.
* గ్రేడిరగ్,తొడిమలు తీసే మిషన్ లను వాడి అధిక లాభం పొందవచ్చు.
* చిన్న కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు చేసుకొని నిలువ చేసి అమ్మితే కూడా లాభం ఉండును.
మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలలో మిరపపొడి తో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్, నూనె మరియు రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు,మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.
* పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాంబు కారంపొడి బాగా డిమాండ్ ఉంటుంది
జిల్లా: జనగాం
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: బియ్యము మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: సాధారణ బియ్యం, బియ్యం పిండి, రవ్వ అటుకులు, మురుమురులు, ఇన్స్తాంట్ రైస్ పదార్థాలు: బిర్యానీ రైస్, కిచిడి, సాంబార్ రైస్, మసాలా రైస్, వెజిటేబుల్ రైస్. లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్నరైస్ ఆధారిత విలువ ఉత్పత్తులు, రైస్ బ్రాన్ ఆయిల్ , స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ మిక్స్, స్వీట్ మొదలైన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ముడిసరుకు అందుబాటులో ఉంటుంది.
జిల్లా: మెదక్, వరంగల్ అర్బన్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి : వివిధ రకాల తినుబండారాలు, స్నాక్స్ ఇన్స్తంట్ ఫుడ్స్
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ మిక్స్, స్వీట్ మొదలైన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే మార్కెట్ అందుబాటులో ఉంటుంది. పప్పు దినుసులు, రైస్, ఇతర కూరగాయలు తో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్, స్నాక్స్, మీల్స్, స్వీట్స్, బెవరేజ్స్ వంటి చిన్న చిన్న పరిశ్రమలు తక్కువ పెట్టుబడి తో ఏర్పాటు చేసుకుని దగ్గర ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో అమ్మి మంచి లాభాలను పొందవచ్చు.
జిల్లా: సంగారెడ్డి
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: పాలు మరియ విలువ ఆధారిత పాల ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: చిన్నచిన్న డైరీ యూనిట్లు, బల్క్ కూలర్స్, నేయీ చేసే యూనిట్లు, ఐస్ క్రీమ్ తయారు చేసే యూనిట్లు, ఫ్లేవర్డ్ మిల్క్ , బట్టర్ మిల్క్ యూనిట్లు, ఎ2 మిల్క్ యూనిట్, స్వీట్స్, ఇతర పాల పదార్థాలను తయారు చేసే చిన్న యూనిట్లు పెట్టుకొని కూడా మంచి లాభాలను పొందవచ్చు.
జిల్లా: సిద్దిపేట
ఒక జిల్లా ఒక ఉత్పత్తి : వివిధ రకాల కూరగాయలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: వివిధ రకాల కూరగాయలను గ్రేడిరగ్, సార్టింగ్ మిషన్ల ద్వారా గ్రేడిరగ్ చేసి మంచి ప్యాకింగ్ మెటీరియల్ వాడి అమ్మి నట్లయితే మంచి లాభం లభించును. కోల్డ్ స్టోరేజ్ లు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాట్లు పూర్తి కూరగాయలు నిల్వ చేయడంతోపాటు అధిక ధరకు అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కట్ విజిటేబుల్కు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. వివిధ ఎండబెట్టి పద్ధతులను అవలంబించి ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలకు ముడి సరుకులుగా అమ్మవచ్చు
దక్షిణ తెలంగాణ మండలం
జిల్లా: హైదరాబాద్, మేడ్చల్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: వివిధ రకాల తినుబండారాలు, స్నాక్స్ ఇన్స్తంట్ ఫుడ్స్
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు : స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ మిక్స్, స్వీట్ మొదలైన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే మార్కెట్ అందుబాటులో ఉంటుంది. పప్పు దినుసులు, రైస్, ఇతర కూరగాయలుతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్, స్నాక్స్, మీల్స్, స్వీట్స్, బెవరేజ్స్ వంటి చిన్న చిన్న పరిశ్రమలు తక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేసుకుని దగ్గర ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో అమ్మి మంచి లాభాలను పొందవచ్చు.
జిల్లా: జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి
ఒక జిల్లా ఒక ఉత్పత్తి : వేరుశెనగ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: పొట్టు తీసి గ్రేడిరగ్, సార్టింగ్ మిషన్ల ద్వారా గ్రేడిరగ్ చేసి మంచి ప్యాకింగ్ మెటీరియల్ వాడి అమ్మి నట్లయితే మంచి లాభం లభించును. టేబుల్ పర్పస్ వేరుశనగ నట్స్, సల్టెడ్ వేరుశనగ నట్స్, మసాలా వేరుశనగ నట్స్ వేరుశనగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, నూనె తీసిన వేరుశనగ చెక్క పల్లి పట్టిలు, వివిధ స్వీట్స్, హైడ్రోలిసెడ్ వెజిటేబుల్ ప్రోటీన్, పీనట్ ప్రోటీన్ కాన్సెంట్రేట్ , వెగన్ ఫుడ్స్, వేగన్ మీట్స్ మొదలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయవచ్చును.
జిల్లా: మహబూబ్‌నగర్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: చిరుధాన్యాలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: చిరుధాన్యాలు, పొట్టు తీసిన చిరుధాన్యాలు, చిరుధాన్యాల ఉప్మా రవ్వ, మల్టీ గ్రీన్ ఆట, చిరుధాన్యాల ఇడ్లీ, దోస రవ్వ, చిరుధాన్యాల అటుకులు, చిరుధాన్యాలతో సత్తుపిండి, చిరుధాన్యాలతో బిస్కెట్లు, కేకులు, బ్రెడ్, పాస్తా, వెర్మీసలి, పాయసం, మొలకెత్తిన చిరుధాన్యాల మాల్ట్ , చిరుధాన్యాల స్నాక్స్, చిరుధాన్యాల తో వివిధ రకాల ఇన్స్టంట్ ఫుడ్స్ మొదలైన వాటిని తక్కువ ఖర్చుతో మిషనరీ వాడి తయారు చేసుకోవచ్చు.
నాగర్ కర్నూల్ మామిడి కాయ మరియు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులు పచ్చి మామిడి కాయలతో ఆంచూర్ పౌడర్, మామిడికాయ పచ్చడి, మామిడి పండు జ్యూస్, మామిడిపండు లెదర్ బార్, మామిడిపండ్ల రిపెనింగ్ చాంబర్, మామిడిపండ్ల జమ్, జెల్లీ, గుంజెళ్ళీస్ మొదలైన చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం.
జిల్లా : నల్గొండ
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: బత్తాయిలు మరి నిమ్మజాతి పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: గ్రేడిరగ్, సార్టింగ్ మిషన్ల ద్వారా గ్రేడిరగ్ చేసి మంచి ప్యాకింగ్ మెటీరియల్ వాడి అమ్మి నట్లయితే మంచి లాభం లభించును. బత్తాయి జ్యూస్, లెమన్ జ్యూస్, బెవరేజెస్, జమ్, జెల్లీ, క్యాండీ దయచేసి అమ్మవచ్చును. విదేశాల్లో ఎండబెట్టిన నిమ్మకాయల కు మంచి డిమాండ్ ఉంటుంది. నిమ్మకాయ పచ్చళ్ళు, నిమ్మ జ్యూస్ పౌడర్.
జిల్లా: రంగారెడ్డి, వికారాబాద్
ఒక జిల్లా ఒక ఉత్పత్తి: వివిధ రకాల కూరగాయలు మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు : వివిధ రకాల కూరగాయలను గ్రేడిరగ్, సార్టింగ్ మిషన్ల ద్వారా గ్రేడిరగ్ చేసి మంచి ప్యాకింగ్ మెటీరియల్ వాడి అమ్మి నట్లయితే మంచి లాభం లభించును. కోల్డ్ స్టోరేజ్ లు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాట్లు పూర్తి కూరగాయలు నిల్వ చేయడంతోపాటు అధిక ధరకు అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కట్ విజిటేబుల్ కు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. వివిధ ఎండబెట్టి పద్ధతులను అవలంబించి ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలకు ముడి సరుకులుగా అమ్మవచ్చు.
జిల్లా: సూర్యాపేట, యాదాద్రి భువనగిరి
ఒక జిల్లా ఒక ఉత్పత్తి : పాలు మరియ విలువ ఆధారిత పాల ఉత్పత్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు: చిన్నచిన్న డైరీ యూనిట్లు, బల్క్ కూలర్స్, నేయీ చేసే యూనిట్లు, ఐస్ క్రీమ్ తయారు చేసే యూనిట్లు, ఫ్లేవర్డ్ మిల్క్, బట్టర్ మిల్క్ యూనిట్లు, ఎ2 మిల్క్ యూనిట్, స్వీట్స్, ఇతర పాల పదార్థాలను తయారు చేసే చిన్న యూనిట్లు పెట్టుకొని కూడా మంచి లాభాలను పొందవచ్చు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల మరియు తెగుళ్ళ నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరచి విలువ ఆధారిత పదార్థాలు తయారు తయారుచేసి ప్యాకేజింగ్ మెటీరియల్‌లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంట గదికి మరియు వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్‌కు చేరే అంతవరకు తగిన యజమాన్య పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మి నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
భవిష్యత్తులో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా రైతులకు, వినియోగదారులకు మరియు గ్రామీణ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. జిల్లా మరియు క్షేత్రస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ద్వారా పంటకోత నష్టాలను తగ్గించడానికి మరియు రైతు స్థాయిలో మరియు వినియోగదారుని స్థాయిలో ధరల స్థిరీకరణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
ఎ. పోశాద్రి, యం. సునీల్ కుమార్, జి. శివ చరణ్, ఎ. రమాదేవి,
యం. రఘు వీర్, వై. ప్రవీణ్ కుమార్
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, ఫోన్ : 9492828965
Also Read: తెలంగాణాలో ఆయిల్ పామ్ సాగు
Leave Your Comments