Ag.BSc Career Opportunities: మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. అనేక రంగాలు వేగంగా అభివృద్ధి సాధించాయి. అయితే వ్యవసాయరంగంలో హరిత విప్లవం చోటు చేసుకుంది. అ తరవాత అనేక బహుళజాతి కంపెనీలు మన దేశంలో అడుగుపెట్టాయి. సంకర జాతి విత్తనాలు, రసాయన పురుగు మందుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, అనేక ప్రైవేటు కంపెనీల్లో బీఎస్సీ చదివిన వారికి అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
అగ్రీ బీఎస్సీ
వ్యవసాయరంగంలో అగ్రీ బిఎస్సి చదివిన వారికి వేలాది ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీలో వ్యవసాయ పద్దతులు, సూత్రాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. పంటల ఉత్పత్తి, నేల స్వభావం, మొక్కల జన్యుశాస్త్రం, వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, తెగుళ్ల నిర్వహణ, నీటిపారుదల వ్యవస్థలపై విద్యార్థులకు పట్టు లభిస్తుంది.
కెరీర్ అవకాశాలు
వ్యవసాయ శాస్త్రవేత్త గా కెరీర్ ప్రారంభించవచ్చు. మొక్కల జన్యుశాస్త్రం, నేల ఆరోగ్యం,వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా పంట ఉత్పత్తిని పెంచడం పై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తారు. పంటల దిగుబడి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీరి కృషి మరువలేనిది.
హార్టికల్చర్ సైంటిస్ట్
ఉద్యానశాఖలో అనేక అవకాశాలుంటాయి. పండ్లు, కూరగాయలు, అలంకార మొక్కల పెంపకం ఉద్యాన నిపుణుల ప్రత్యేకత. తోట పంటల్లో దిగుబడి, నాణ్యత, వ్యాధి నిరోధకతను మెరుగుపరచడంలో వీరు పనిచేస్తారు.
Also Read: Pearl Millet Seed Production: సజ్జ విత్తనోత్పత్తిలో ఎలాంటి మెళకువలు అవసరం.!
సాయిల్ సైంటిస్ట్
నేల నిర్వహణ, భూ లక్షణాలు, సంతానోత్పత్తి, భూమి రకాలపై అధ్యయనం చేస్తారు. భూసార పరిరక్షణ వీరి పాత్ర కీలకం. వ్యవసాయ పద్దతులు మెరుగుపరచడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తాయి.
ప్లాంట్ బీడర్, జన్యు సైంటిస్ట్
మొక్కలు పెంచడం, అధిక దిగుబడి సాధించడం, వ్యాధి నిరోధకత, పోషక విలువలు కలిగిన పంటల దిగుబడినిచ్చే మొక్కల ఉత్పత్తిపై వీరు దృష్టి సారిస్తారు. కొత్త మొక్కలను అభివృద్ధి చేయడంలో వీరిది కీలకపాత్ర. జన్యు శాస్త్రవేత్తల మొక్కలను మరింత మెరుగైన లక్షణాలు ప్రవేశపెట్టి దిగుబడులు పెంచడానికి కృషి చేస్తారు.
అగ్రికల్చర్ ఎకనామిస్ట్
ఇది కోర్సు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఆర్థిక అంశాలను విశ్లేషిస్తారు. మార్కెట్ ట్రెండును, ధరలు, రైతుల ఆర్థిక స్థితి గతులు, వ్యవసాయ వ్యాపారంపై ప్రభావం చూపే అంశాలపై వీరి విశ్లేషణలు ఉంటాయి.
వ్యవసాయ విస్తరణ అధికారి
విస్తరణ అధికారులు పరిశోధన ఫలితాలను రైతుల వద్దకు తీసుకెళతారు. పరిశోధనాశాలకు రైతులకు మధ్య వారదులు గా నిలుస్తారు. కొత్త వ్యవసాయ సాంకేతికతలను, సమాచారాన్ని గ్రామీణ సమాజానికి విస్తరిస్తారు. రైతులకు ఆధునిక పద్దతులు చేరవేస్తారు.
అగ్రి బిజినెస్, రూరల్ డెవలప్మెంట్
ప్రాసెసింగ్ యూనిట్లు, రసాయన ఎరువులు, విత్తనాల పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించడం వీరి భాద్యత. వ్యవసాయ సంస్థల నిర్వహణ చూడాల్సి ఉంటుంది. అగ్రి బిజినెస్ మేనేజర్ లకు మంచి డిమాండ్ ఉంది. ఇక రూరల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.
Also Read: Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్దతులు.!