Rodent Management in Rich Crop: మన రాష్ట్రంలో ఆహారపంటల్లో వరికి చీడపీడల కంటే ఎక్కువగా ఎలుకల వలన అపారనష్టం కలుగుతోంది. ముఖ్యంగా వరి పొలాన్ని నష్టం చేసే రెండు రకాల ఎలుకలలో పొలం ఎలుక (బాండికూట్ బెంగాలెన్సిస్) చాలా ఎక్కువ నష్టపరుస్తుంది. పొలం ఎలుక చాలా బలీయమైనది. వరిసాగులో ఎలుకలు నారుమడి పొసిన నాటి నుండి పంటకోసే వరకు అనేక విధాలుగా నష్టం కలుగజేస్తాయి.
- నారుమడిలో విత్తనాలు తీనడం.
- పరిగిన నారును కొట్టడం.
- వేసిన నాట్లును పీకి వేయడం.
- పిలకలు వేసే దశ నుండి పూత దశ వరకు దుబ్బులు కొట్టడం.
- కోతకు వచ్చినపుడు కంకులు కత్తిరించి కన్నాలలో దాచుకోవడం.
ఎలుకలు వరి దుబ్బును 45 డిగ్రీల కోణంలో మొదళ్ళ దగ్గర కత్తిరించి వేయడం వలన పొలంలో అక్కడక్కడ గూళ్ళలాగా పైరు పడిపోయి ఖాళీస్థలాల వలన పంటనష్టాన్ని గుర్తించవచ్చు. ఎలుకలు పొలంగట్లమీద, కాలువగట్ల మీద, పోరంబోకు స్థలాల్లో బొరియలు తవ్వి వాటిలో నివశిస్తాయి. ఒక బొరియకు 2`3 దారులు ఏర్పరుచుకొంటాయి. పొలంలో ఎలుకలు సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎలుకలు ఒక సంవత్సరంలో నాలుగుసార్లు పిల్లలు పెట్టి ఒక్కొక్కసారికి 6 పిల్లలు పెడుతుంది. ఒక ఎలుక ఒక సంవత్సరకాలం, అంతకన్నా ఎక్కువకాలం జీవిస్తుంది. ఒక జత ఎలుకల నుండి (ఆడ, మగ) ఒక సంవత్సర కాలంలో ఎక్కవ మొత్తంలో ఎలుకలు ఉత్పత్తి అవుతాయి. ప్రతికూల పరిస్థితులలో ఒక ఎలుక ఒకసారి ఆరుకన్నా ఎక్కువ పిల్లలు పెడుతుంది.
Also Read: Rodent Management in Rice: వరి లో ఎలుకల నియంత్రణ యాజమాన్య పద్ధతులు .!
నివారణ: ఎలుకల నివారణకు అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను సకాలంలో సామూహికంగా చేపట్టినట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతాం.
- గట్లను చెక్కి శుభ్రం చేసి వాటి పరిమాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి.
- కలుపు నివారణ బాగా చేపట్టాలి. ఇలా చేయడం వలన ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారం దొరకక పోవడంతో దూర ప్రాంతాలకు వలసపోతాయి.
- నారుమడి తమారి నుండి ఎలుక కన్నాలను గుర్తించి పొగబారించి ఎలుకలను నిర్మూలించాలి.
ఎలుకల నివారణకు చాలా రకాల రసాయనిక విషపదార్థాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అల్యూమినియంఫాస్ఫైడ్, జింక్ ఫాస్ఫైడ్, బ్రోమోడయోలిన్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
జింక్ ఫాస్ఫైడ్ ఎర: జింక్ ఫాస్ఫైడ్ బూడిద నలుపు రంగులో ఉండి వెల్లుల్లి వాసన కలిగిఉంటుంది. జింక్‌ఫాస్ఫైడ్ వేగంగా పనిచేసే ఎలుకల మందు. మందు తినిన 24 గంటలలోపే ఎలుకలు చనిపోవడం గమనించవచ్చు. ఈ జింక్ ఫాస్ఫైడ్ గోదాములు, ఇళ్ళు, పొలాలు, షాపులు, ఇతర ప్రదేశాలలో కూడా ఉపమోగించవచ్చు. అన్ని రకాల ఎలుకలను సమర్థవంతంగా అరికడుతుంది. ఈ మందు వాడే ముందు ఎలుకలను మచ్చిక చేసుకోవడం తప్పనిసరి, ఇందుకోసం ముందుగా నూకలు, నూనె కలిపి ఎలుకలకు ఎరగా వేయాలి. ఈ విధంగా 2 నుండి 3 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవలసి ఉంటుంది. తర్వాత 100 గ్రాములు నూకలకు 2.5 గ్రాములు జింక్ ఫాస్ఫైడ్, తగినంత వంటనూనె చేర్చి విషపు ఎరను తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల చొప్పున ఎలుకలు తిరిగే ప్రదేశాలలో ఉంచాలి. జింక్ ఫాస్ఫైడ్ ఎరనువాడి ఎలుకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
బ్రొయోడయోలిన్: బ్రోయోడయోలిన్ ఎర వాడుకలో ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ పద్ధతిలో ఎలుకలను మచ్చిక చేసుకోవలసిన అవసరం లేదు. ఈ మందు నిధానంగా పనిచేసే విషపు మందు గ్రూపునకు చెందినది. ఎలుకలు మందు తినిన 3 నుండి 5 రోజుల లోపల చనిపోవడం గమనించవచ్చు. ఎలుకలు కన్నాల నుండి బయటికి వచ్చి చనిపోతాయి. అందువల్ల మనం సులువుగా గుర్తించి పారవేయడానికి వీలుంటుంది. ఈ ఎర మందును పొలాలు, గోదాములు, ఇండ్లలో సమర్థవంతంగా, తేలికగా వాడుకోచ్చు. బ్రోయెడయోలిన్ పొడి, బిస్కెట్లు రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. పొడిరూపంలో ఉన్న బ్రోమోడయెలిన్ వాడేటట్లయితే 100 గ్రాముల నూకలకు 2 మి.లీ. నూనెను బాగా పట్టించి తరువాత 2 గ్రాములపొడి కలిపి ఎర తయారు చేయాలి. బిస్కెట్ల రూపంలో రెడీమెడ్ బ్రోయోడయోలిన్ దొరుకుతుంది, కాబట్టి తయారుచేసుకొనే పనిలేదు. ఈ బ్రోమెడయెలిన్ బిస్కెట్లు రోబాన్, హిట్ అనే వ్యాపార నామాలతో మందుల షాపులలో దొరుకుతుంది.
-శ్రీ పి. మధుకర్ రావు, శాస్త్రవేత్త (అగ్రానమి), శ్రీ పి. గోన్యానాయక్, శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడిరగ్),
-యన్. నవత శాస్త్రవేత్త (ఆగ్రానమి), డా॥ బి. రాజు శాస్త్రవేత్త (మృత్తిక శాస్త్రం)
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల.
Also Read: Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే లాభాలు.!
Must Watch: