జాతీయంతెలంగాణరైతులు

 Grambharati Kisan Expo 2023: గ్రామభారతి కిసాన్ ఎక్స్‌పో 2023 కి స్వాగతం

1
 Grambharati Kisan Expo 2023
 Grambharati Kisan Expo 2023

 Grambharati Kisan Expo 2023: గ్రామ భారతి స్వచ్చంధ సంస్థ వారు మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు “కిసాన్ ఎక్స్‌పో” ను నిర్వహిస్తున్నారు. ఈ కిసాన్ ఎక్స్‌పో మాదాపూర్ హైటెక్స్ లో జరగనుంది. కిసాన్ ఎక్స్‌పో 2023 లో సేంద్రియ పద్దతులతో పండించిన ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయ విధానాలు ప్రదర్శనలో ఉంటాయి. అంతే కాకుండా తోటి అభ్యుదయ రైతులు & శాస్త్రవేత్తలతో పరిచయ కార్యక్రమాలు, తోటి రైతుల ద్వారా వివిధ రకాల సాగు మెళుకువలు తెలుసుకోవచ్చు. వినియోగదారులు కూడా తమ ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు.

Also Read: Asparagus Benefits: వేసవి కాలంలో మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలనుకుంటే ఇది తప్పక తినాల్సిందే!

 Grambharati Kisan Expo 2023

Grambharati Kisan Expo 2023

కిసాన్ ఎక్స్‌పో 2023 లో అధునాతన యంత్రాలు, ఆటోమేషన్, అత్యాధునిక సాంకేతికతలను స్వీకరించడం, డ్రోన్‌లు, చిన్న మరియు మధ్య తరహా వ్యవసాయ పరికరాలు మరియు పనిముట్లు వంటి ఖచ్చితత్వ సాంకేతికతలు, ఆహార ప్రాసెసింగ్, MSMEలకు విలువ జోడింపు, ఆవు ఆధారిత వ్యవసాయం వంటి సాంప్రదాయ పద్ధతులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ కిసాన్ ఎక్స్‌పోలో మానవ వనరుల కొరత, రియల్ టైమ్ పంట ఆరోగ్యం, మెరుగైన లాజిస్టిక్స్ నిర్వహణ, తగ్గిన వ్యర్థాల వయస్సు మరియు ఆహార ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు వంటి సమస్యల గురించి కూడా తెలుసుకోవచ్చు.

“ఈ కిసాన్ ఎక్స్‌పో ” ఒక్క వ్యవసాయదారులకే మాత్రమే కాదు. వ్యవసాయం చేయాలన్న ఉత్సాహం ఉన్నవారికి, మిద్దె తోటల పెంపకందారులకి మరియు విషరహిత ఆహారం కోరుకొనే ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైంది.

ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్ కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
+91 74161 60182, 8985653876,89852 53875.

Also Read: Sugarcane Internode Borer: చెరుకును ఆశించు పీక పురుగు యాజమాన్యం పద్ధతులు.!

Leave Your Comments

Asparagus Benefits: వేసవి కాలంలో మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలనుకుంటే ఇది తప్పక తినాల్సిందే!

Previous article

Soil Testing Significance: భూసార పరీక్ష- ఆవశ్యకత.!

Next article

You may also like