Marigold Cultivation: నాపేరు మహా లక్ష్మీ నాయుడు, చిన్న పాచిల్లి గ్రామమం, రావి కమతం మండలం, అనకాపల్లి జిల్లా. నేను గతంలో వంగ, మిరప, చిక్కుడు మరియు టమాటను ఎక్కువగా సాగు చేసే వాడిని కానీ చీడపీడలు సమస్యలు, ప్రస్తుతం మార్కెట్లలో ముడి ఇంధనాల ఖర్చు అధికంగా ఉండటం ద్వారా మరియు పంట దిగుబడి వచ్చినప్పటికీ మార్కెట్‌లో ధర లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడేవాడిని. ఈ తరుణంలో నేను కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్ర వేత్తలను సంప్రదించంగా వారు నేల స్వభావాన్ని పరిశీలించి తక్కువ విస్తీర్ణంలో, తక్కువ కాలంలో అధిక రాబడి వచ్చి వచ్చి బంతిని అందరికన్నా భిన్నంగా సాగు చేస్తే మార్కెట్లో మంచి గిరాగి ఉంటుందని సూచించారు.
మాకు కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, శాస్త్రవేత్తలు బంతి సాగు ఖరీఫ్‌లో (జూలై), రబీలో (సెప్టెంబరు) మరియు వేసవిలో (ఫిబ్రవరి) లో సాధారణంగా బంతి ప్రధాన క్షేత్రంలో నాటుకుంటారు. కాని నేను శాస్త్రవేత్తలు సూచించినట్లు వేసవిలో ఏప్రిల్ రెండవ వారంలో ప్రో ట్రేలలో బంతి నారు (25 రోజుల వయస్సు) పెంచి 25 సెంట్లులకు మాకు ఉచితంగా 3 రకాలను అర్క అభి మరియు ఎల్లో ఫ్రైడ్(పసుపు రంగు) మరియు. ఆరెంజ్ బాల్ ( ఆరెంజ్ రంగు) ఉచితంగా సరఫరా చేశారు. తరువాత నాటిన బంతి మొక్కలను 60I60 సెం.మీ అనగా వరుసకు, వరుసకు మరియు మొక్కకు, మొక్కకు మధ్య దూరంలో నాటుకున్నాను.
నాటిన 30-35 రోజులు తరువాత పించింగ్ అనగా బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లి చేస్తే తొలగిపోయి ఆక్సిన్స్ సరఫరా జరిగి ప్రక్క కొమ్మలకు వ్యాపించి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువగా దిగుబడి వస్తుంది. అలాగే సమగ్ర పోషక యాజమాన్యం మరియు సమగ్రసస్యరక్షణ చర్యలు పాటించాను. అలాగే మొక్కలు పెరుగుదల కోసం ప్రతి 20 రోజులకు ఒకసారి ఎన్‌పికె 19:19:19 59 ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Marigold Farming: బంతి సాగు
అలాగే రసం పీల్చే పురుగులు పేను, తామర పురుగుల బెడద నుండి రక్షణ కొరకు డైమిథోయేట్ 2.0 లేదా ఫిప్రోనిల్ 2.0 మి .లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండకాలంలో బంతి సాగు కాబట్టి ప్రతి 5 రోజులు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి.బంతి పూలు మొదట కోతకు మే చివరి వారంలో ప్రారంభమయ్యాయి. కానీ ఎక్కువ పూల దిగుబడి జూన్ నెల నుండి ప్రారంభమై ఆగష్టు నెల వరకు వచ్చాయి. అలాగే మార్కెట్లలో కూడా కిలోకు రూ.80 – 120/- ధర వచ్చింది. ఎందుకంటే ఈ నెలలో గృహప్రవేశాలు, వరలక్ష్మీ వ్రతం, పెళ్ళిళ్ళు ఎక్కువగా కాబట్టి మాకు బంతిపూల నుండి మంచి రాబడి వచ్చింది. ఈ పూల సాగును అనుభవంగా తీసుకొని నేను ఇప్పుడు సొంతంగా 50 సెంట్లుల విస్తీర్ణంలో బంతి సాగు చేపట్టాను.
సాగు వివరాలు:
విస్తీర్ణం : 25 సెంట్లు
విత్తనం ఖర్చు : రూ. 3000/-
ఎరువులు, పురుగు మందులు మరియు కూలీల ఖర్చు : రూ. 6725/-
పూల దిగుబడి : 565 కిలోలు
కిలో పూల ధర : రూ. 85/`
R 565 I 85 R 48025/-
25 సెంట్లలకు పెట్టుబడి : 9725/`
స్థూల ఆదాయం: 48,0251/-
నికర ఆదాయం : 48,025-9,7251
R38300/-
-డా.ఎన్. సత్తి బాబు, డా.ఎన్. రాజ్ కుమార్, డా.వి .గౌరి, పి .బాబు,
-డా. కె.శంకర్, డా. సిహెచ్. మహాలక్ష్మీ, డా. ఎన్. కిశోర్,
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఫోన్ : 8639066690
Also Read: Marigold Cultivation: బంతి సాగు విధానం, సస్యరక్షణ, ఆదాయం.!