sankranthi festivals 2022: తెలుగు లోగిళ్లు.. సంక్రాంతి కళతో శోభాయమానంగా మారాయి. భోగి మంటలతో వేడుకలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. కుటుంబాలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. మనవైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి.. రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ నిదర్శనం.
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు. happy sankranti 2022
సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగరేయడం మరో ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు జరిపితే… తెలంగాణలో పతంగుల పండుగ జరుపుతారు.
దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని..ఈ సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ఏరువాక మాస పత్రిక. Makar Sankranti 2022