Chinthamani Chilli: ప్రస్తుతం అకాల వర్షాల వల్ల కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా ధర ఉండటం వల్ల కూరగాయల పంటలే సాగు చేయాలి అని అనుకుంటున్నారు. ఈ ధరలకి అనుకూలంగా ఎక్కువ మొత్తంలో రైతులు టమాట, మిర్చి సాగు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో , దీనిమీదపల్లి గ్రామంలో అందరూ రైతులు ఎక్కువగా టమాట సాగు చేస్తున్నారు. గ్రామంలో అందరూ టమాట సాగు చేస్తుంటే రైతు అనసూయ గారు టమాట సాగుతో పాటు మిర్చి సాగు చేస్తూ మంచి లాభాలని పొందుతున్నారు.
మిర్చిలో కొత్త రకం వెరైటీ సాగు చేస్తున్నారు. ఈ కొత్త రకం మిర్చిని సన రకం మిర్చి లేదా చింతామణి రకం అని కూడా అంటారు. ఈ రకం సాధారణ మిచ్చి కంటే చాలా సన్నగా ఉంటుంది. ఎక్కువ కారంగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మిర్చి ఒక్కసారి నాటుకుంటే సంవత్సరంలో 4 నుంచి 5 సార్ల వరకు మంచి దిగుబడి వస్తుంది.
Also Read: Maize Cultivation: మొక్క జొన్న పంట ఎలా సాగు చేయాలి..
అన్నమయ్య జిల్లా సమీపంలో మదనపల్లి మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఆసియలోనే అత్యంత పెద్ద మార్కెట్. ఈ ప్రాంతంలో 70% టమాట పంట సాగు చేస్తున్నారు. ఎక్కువ ఆదాయం కావాలి అనుకున్న రైతులు టమాట పంటతో పాటు మిర్చి పంట కూడా సాగు చేస్తున్నారు. టమాట ధర ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి పెరుగుతుంది, మరో సారి తగ్గుతుంది. దీని వల్ల రైతులకి ఆదాయం తగ్గుతుంది అని మిర్చి సాగు చేస్తున్నారు.
మిర్చి ధర తగ్గిన కూడా ఎండు మిర్చి ధర మంచిగా వస్తుంది. పచ్చి మిర్చి ధర తక్కువగా ఉన్నపుడు రైతులు ఎండు మిర్చిగా అమ్ముకొని మంచి లాభాలు చేసుకుంటున్నారు. ఇలా రెండు పంటలు సాగు చేయడం వల్ల రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.
Also Read: Chilli Nursery Management: మిరప నారును ఏ నెలలో పోసుకుంటే ఆధిక దిగుబడులు వస్తాయి.!