Amazon Microsoft Cisco: వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పాత్ర రోజురోజుకు పెరుగుతుంది. విదేశాల్లో ఇప్పటికే టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అయితే ప్రస్తుత ఆధునిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న టెక్నాలజీ విషయంలో భారతదేశం ఇంకా వెనుకబడి ఉందనే చెప్పాలి. నిజానికి మన దేశ ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం కేంద్ర బిందువుగా పని చేస్తుంది. దేశ జనాభాలో ఎక్కువ మందికి అగ్రికల్చర్ ప్రధాన వనరు. అయితే దేశంలో అధిక మొత్తంలో పంటలు పండిస్తున్నప్పటికీ అందులో టెక్నాలజీ పాత్ర కొంతమేర అనే చెప్పాలి.
రోజులు మారుతున్నా కొద్దీ వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైతుల్లో అవగాహన, అధికారుల ముందు చూపు వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నిదర్శనం. కాగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయి. వ్యవసాయంలో టెక్నాలజీని విరివిగా వాడేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి పెద్ద కంపెనీలు కేంద్రంతో ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యవసాయ తీరు తెన్నులు, పొడక్టవిటీ పెంచే విధంగా ఈ కంపెనీలు పాత్ర పోషిస్తాయి. అందులో భాగంగా అమెరికాకి చెందిన పెద్ద కంపెనీలతోపాటు మన దేశంలోని మరి కొన్ని కంపెనీలు సైతం ఇందులో భాగమవుతున్నాయి. పంట దిగుబడి, భూసారం, ఎవరికెంత భూమి ఉందనే వివరాలను యాప్స్, టూల్స్ ద్వారా సేకరించడంతోపాటు, సమయానుకూలంగా రైతులకు సూచనలు, సలహాలను కూడా ఇవ్వడం టెక్నాలజీ ఉపయోగపడనుంది.
Also Read: ఇలా కూడా మిద్దె తోట ప్రారంభించొచ్చు !
2025 నాటికి మన దేశంలో వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2025 నాటికి మన దేశ వ్యవసాయ రంగం 24 బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ. 1.77 లక్షల కోట్లకి చేరుతుందని అంచనా. ఇందుకోసం కేంద్రం ముందు చూపుతో మార్పుల కోసం బడా కంపెనీలను పోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ల ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త టెక్నాలజీలు మన దేశ వ్యవసాయ రంగానికి ఎంతో అవసరం పడనున్నాయి.
అయితే అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి యూఎస్‌లోని పెద్ద టెక్నాలజీ కంపెనీలతోపాటు మన దేశంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, ఐటీసీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంతకీ సదరు కంపెనీల పాత్ర దేనిపై పని చేస్తుంది అంటే.. పంట సాగు, భూసారం, ఇన్సూరెన్స్, క్రెడిట్, వాతావరణ మార్పులు వంటి అన్నివిషయాలనూ ఒకే డేటాబేస్‌లోకి తెచ్చి, ఏఐ, డేటా ఎనలిటిక్స్ సాయంతో ఆ డేటాను విశ్లేషిస్తుంది.
Also Read:మిద్దె తోటలలో టమాటా మొక్కల యాజమాన్యం