World Food Prize 2020 Recepient: పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ యొక్క (PAU) పూర్వ విద్యార్థి మరియు ఒహియో స్టేట్ యూనివర్శిటీ (OSU) నుండి ప్రఖ్యాత వ్యవసాయ నేల శాస్త్రవేత్త అయిన డాక్టర్ రత్తన్ లాల్ గారికి 2020వ సంవత్సరంలో ప్రపంచ ఆహార బహుమతి విజేతగా ప్రకటించారు.

World Food Prize 2020 Recepient
జూన్ 11న ఆన్‌లైనలో జరిగిన వేడుకలో వాషింగ్టన్ నుండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయిన బార్బరా స్టిన్సన్ ఈ విషయాన్ని తెలియజేశారు. 2020సంవత్సరంలో బోర్లాగ్ డైలాగ్ ఇంటర్నేషనల్ సింపోజియం సందర్భంగా జరిగిన వేడుకలో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన డాక్టర్ రత్తన్ లాల్‌కు 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అధికారికంగా అందించారు. 2020 సంవత్సరంలో థీమ్ ఏమిటంటే “బ్రేకింగ్ న్యూ గ్రౌండ్: బిల్డింగ్ రెసిలెన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ టుమారో.”
Also Read: Kitchen Garden: కిచెన్ గార్డెన్ యొక్క ప్రయోజనాలు
“పరిమిత మరియు పెళుసుగా ఉండే నేలను సంరక్షించడం కోసం సమర్థవంతమైన చర్యలను అనుసరించాలి అనగా మట్టి సేంద్రీయ కార్బన్‌ను సీక్వెస్ట్రేషన్ చేయడం ద్వారా వనరుల ఆరోగ్యాన్ని రక్షించవచ్చు మరియు పునరుద్ధరించవచ్చు అని దాని ప్రాముఖ్యతను గుర్తించడం వలన నాకు 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు లభించిందని” అని లాల్ అన్నారు.

Rattan Lal
ప్రతి సంవత్సరం, ప్రపంచ స్థాయి ప్రదర్శనకారులను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీతను గౌరవించడానికి వేదికపైకి ఆహ్వానిస్తారు. అంతకు ముందు వచ్చిన ప్రదర్శనకారులలో రే చార్లెస్, జాన్ డెన్వర్, చాచీ తడేస్సే, లెస్లీ ఓడమ్ జూనియర్ మరియు కథక్ గుంజన్ ఉన్నారు. 2020 సంవత్సరంలో ఏ.ఆర్. రెహమాన్ అత్యంత ప్రశంసలు పొందిన భారతీయ స్వరకర్త, గాయకుడు మరియు సంగీత నిర్మాత ఇందులో పాల్గొన్నారు. అతని అనేక అంతర్జాతీయ అవార్డులలో రెండు అకాడమీ అవార్డులు వచ్చాయి, అందులో రెండు గ్రామీలు మరియు గోల్డెన్ గ్లోబ్ ఉన్నాయి. సహజ వనరులను సంరక్షించే మరియు వాతావరణ మార్పులను తగ్గించే మరియు ఆహార ఉత్పత్తిని పెంచే నేల-కేంద్రీకృత విధానాన్ని అభివృద్ధి చేసినందుకు అతనికి బహుమతి లభించింది.
Also Read: Gir Cow Milk: గిర్ ఆవు పాలకు ప్రజాదరణ పెరుగుతోంది