పురుగు మందులు సస్య రక్షణలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. పంటలను ఆశించి నష్టపరిచే ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీటి నియంత్రణకు మందులను వాడుతున్నప్పటికీ వీటి ఎడల రైతులకు సరైన అవగాహన లేదు. పురుగుల మందు విచక్షణారహితంగా వాడడంతో పర్యావరణ కాలుష్యంతో పాటు వీటి అవశేషాలు ఆహార పదార్థాలలో సమస్యగా మారుతున్నాయి. ఈ కారణాల వలన ఈ మందులపై సమగ్ర అవగాహన పెరగాలి. పురుగుల మందుల కొనుగోలు, వినియోగ మోతాదు, విష తీవ్రతను గుర్తించడంలో మెలకువలను పాటిస్తే ఎటువంటి హాని లేకుండా వీటిని సురక్షితంగా వినియోగించుకోవచ్చు.
సస్యరక్షణ మందులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన సూచనలు :
-
పురుగు గమనించిన తర్వాత అది సమస్యాత్మకమో, కాదో శాస్త్రవేత్తలను/ వ్యవసాయ కారుల ద్వారా తెలుసుకోవాలి.
-
వివిధ పురుగులకు మందులు కావాల్సిన సాంద్రత సమాచారం తెలుసుకొని అప్పుడు సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలి.
-
సస్య రక్షణ మందుల గుణగణాల పై అవగాహన ఉన్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులు కొనుగోలు చేయాలి కొన్ని మందుల యొక్క వివరాలను పొందుపరచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
-
కొనే ముందు డబ్బా సీలు సరిగా ఉందో లేదో చూసుకోవాలి. డబ్బా మీద ఉన్న సూచనలను గమనించాలి ముఖ్యంగా
1. తయారీ కంపెనీ పేరు
2. లైసెన్స్ మరియు బ్యాచ్ సంఖ్య
3. మందు తయారీ తేడా , వాడ దగ్గ చివరి తేదీలను గుర్తించాలి.
4. సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష్ప ప్రభావం కోల్పోయే కొత్త రకం సస్య రక్షణ మందులను వాడాలి.
పురుగుమందు నిల్వలో పాటించవలసిన జాగ్రత్తలు :
-
పురుగుల మందును వాడే ముందు సీలును తీయాలి.
-
మందు డబ్బాలను ఆహార పానీయాలకు దూరంగా అందకుండా భద్రపరచాలి.
-
పురుగుల మందులు పొడి మరియు బాగా వెలుతురు ఉండే ప్రాంతంలో ఉంచాలి.
-
మందులను పశువుల కొట్టాల్లో, పొలాల్లో పశువుల మేత దూరంగా ఉంచుకోవాలి.
-
మందులు నిల్వ ఉన్న గదిలో ఇతర పనిముట్లను తీసుకొని రాకూడదు.
-
ఎప్పుడైనా మందులు గదిలోకి వెళ్లాలనుకుంటే తలుపులను అరగంట సేపు తీసి ఉంచి ఆ తర్వాత మాత్రమే వెళ్లాలి.
విష తీవ్రత గుర్తింపు :
-
పురుగు మందుల విష తీవ్రతను సులువుగా గుర్తించవచ్చు.
-
ప్రతి మందు డబ్బా పై గుర్తు ఉంటుంది. ఇది రెండు సమాన భాగాలుగా చేయబడి ఉంటుంది. క్రింది భాగంలో గల రంగును బట్టి విష తీవ్రతను గుర్తించవచ్చు . అంతే కాక వాడేటప్పుడు జాగ్రత్త పడవచ్చు. ఈ త్రిభుజాకారంలో నాలుగు రకాల రంగులు ఉంటాయి. అవి ఎరుపు , పసుపు ,నీలం , మరియు ఆకు పచ్చ.
డబ్బా మీద కల త్రిభుజంపై సగ భాగంలో పుర్రె , రెండు ఎముకులతో పాటు “ పాయిజన్ “ అని రాసి ఉంది క్రింది సగ భాగంలో ఎరుపు రంగు ఉంటే అది అత్యధిక విషపూరితమని గ్రహించాలి. అదే పసుపు రంగు ఉంటే ఆ మందు అధిక విష పూరితమని గ్రహించాలి నీలం రంగు ఉంటే ఒక మోస్తారు విషపూరితమైనదిగా గ్రహించాలి.
యస్. ఓం ప్రకాష్ , శాస్త్రవేత్త ( కీటక శాస్త్రం) , డా ఎమ్ . ఉమాదేవి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస , జగిత్యాల.
Also Read : యాసంగిలో ఆవాల సాగు మెలకువలు
Leave Your Comments