Citrus Crop Protection: ఈ పురుగు AP లో బత్తాయి, నిమ్మ పండించే అన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ చెట్లను కాకుండా చిన్న అంట్లను కూడా ఆశిస్తుంది. ఇది బేల ్పత్తి, కరివేపాకు చెట్లను మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది.
Also Read: Lemon Water: శరీరంలో అనేక రోగాలకు ఒక గ్లాస్ లెమన్ వాటర్
గుర్తింపు చిహ్నాలు (MOI):
- సీతాకోక చిలుక రెక్కలపై నలుపు మరియు పసుపు పచ్చని మచ్చలుంటాయి. ఇవి పెద్దగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
- లద్దెపురుగు మొదట్లో నల్లగా లేదా గాఢ గోధుమరంగులో ఉండి మొదట్లో పక్షుల రెట్ట మాదిరిగా కాని కనిపిస్తుంది.
- బాగా ఎదిగిన లార్వా ముదురు ఆకుపచ్చ రంగుకి మారి సుమారు 45Cm పొడవు ఉంటుంది. దీని రంగులేత నారింజరంగులో మారిపోతాయి.
- లార్వాను కదిపిన ఎడల రక్షించుకోవడానికి దాని తలలోని చీలి ఉన్న గులాబి రంగు కొమ్మును (ఆస్మటారియం) బయటకు తీసి శత్రువులను భయపెడతాయి.
లక్షణాలు:
- జూలై నుండి ఫిబ్రవరి వరకు ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటుంది.
- ముఖ్యంగా లేత ఆకులు వచ్చే సమయంలో ఈ పురుగు చీని, నిమ్మచెట్ల ఆకులను పూర్తిగా తిని విపరీతంగానష్టాన్ని కలుగజేస్తుంది.
- ఆకుల మధ్యఈనె తప్ప మిగతా భాగాన్ని పూర్తిగా తినేస్తుంది.
జీవిత చక్రం:
- తల్లి పురుగు పసుపువర్ణంలో కలిగిన గుడ్లను ఒక్కొక్కటిగా లేత ఆకులపై లేదా లేక కొమ్మలపై పెడుతుంది.
- లద్దెపురుగు 11-21 రోజులు పెరిగి ఊలుదారం సహాయంతో మొక్కను అంటుకొని కోపస్థదశలో ప్రవేశిస్తుంది. కోశస్థదశను (పారిస్) అని అంటారు.
ప్యూపా దశ: 816 రోజులు
యాజమాన్య పద్ధతులు:
- లద్దెపురుగు మరియు కోశస్థదలను చేతితో ఏరి నాశనం చేయవలెను.
- ఈ పురుగుల నివారణకు 1.5ml మోనోక్రోటోఫాస్ (or) 2ml మిథైల్ పారాథియాన్ (or) 1ml ఫెన్వల్ట్ 1Lt నీటికి కలిపి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారి చేయాలి.
చెదలు:
లక్షణాలు:
- ఇవి లేత మొక్కల నుండి ముదురు చెట్లవరకు ఆశించి నష్టం కలిగిస్తాయి.
- ఈ చెదలు ఉదృత్తి తేలిక నేలలలో, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉంటుంది.
- పిల్ల మరియు పెద్ద పురుగులు కాందాన్ని ఆశించడం వల్ల చెట్టు ఎండిపోయి చనిపోతుంది.
- మొక్క బెరడును తినుట వల్ల మొక్క శక్తిహీనమై ఎదుగుదల లేక చివరిదశలో ఎండి చనిపోతుంది.
- ఈ పురుగులు మొక్క మొదళ్ళు, గూళ్ళుగా చేసుకొని గుంపులు గుంపులుగా ఉంటూ నష్టం కలిగిస్తాయి.
నివారణ:
- తోటలలో ఎండిన కొమ్మలను ఏరివేసి కాల్చివేయాలి.
- మట్టిని రాల్చేసి బోర్డ్ పేస్ట్‌ను పూయాలి.
- అంతరకృషి, సేద్యం చేసేటప్పుడు అక్కడక్కడ చెదలు పట్టలను త్రవ్వివేయాలి.
- పూర్తిగా కుళ్ళని సేంద్రియ ఎరువులను చెట్లకు వేసినప్పుడు చెదలు పెరిగే అవకాశం ఎక్కువ కావున ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి.
Also Read: Lemongrass Farming: మార్కెట్లో లెమన్‌గ్రాస్ మొక్కకు విపరీతమైన డిమాండ్
Leave Your Comments