మన దేశంలో తమలపాకును తాంబూలంగా ఉపయోగించడం అందరికీ తెలిసిందే. చిన్న శుభకార్యం జరిగినా సరే అవి లేనిదే పని జరగదు. ఈ క్రమంలోనే తమలపాకు సాగుకు మంచి డమాండ్ ఏర్పడింది. మర రాష్ట్రంలో రెండు రకాల విత్తలాను సాగు చేస్తుంటారు. వీటిని విత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో నాటాల్సి ఉంటుంది. తమలపాకు సాగులో జాగ్రత్తగా పద్దతులు అనుసరించే.. మంచి దిగుబడి రావడం ఖాయం.
ముఖ్యంగా ఎరువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీగలు ఎగబాకించిన తర్వాత రెండు నెలలకు యూరియా, వేప పిండి కలిసి 40 కిలోల చొప్పున కలిగి తీగల వద్ద చల్లాలి. అలా చేస్తే తెగుళ్ల నుంచి పంటను కాపడినట్లవుతుంది. ఆకులకు అప్పుడప్పుడు పురుగులు పడుతుంటాయి. వాటి వల్ల మచ్చలు ఏర్పడతాయి.వీటివల్ల ఆకులు కుల్లిపోయే ప్రమాదం ఉంది. వీటిని నివారించాలంటే 50 శాతం కార్బరిల్ పొడి మందును రెండు గ్రాములు తీసుకుని లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. వీటితో పాటు, బర్మా పురుగు, ఎండుతెగులు, ఆకుపచ్చ తెగులు అని రకరకాల వ్యాధులు పంటను చుట్టుముడుతుంటాయి. వాటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పంటను చూసుకోవాలి.
ఇలా గనక చేస్తే పంట పుష్కలంగా చేతికి రావడమే కాకుండా.. మంచి లాభాలు కూడా అర్జిస్తారు. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్న రైతులు మంచిగా సంపాదించారు. ఇందులో దైర్యంతో పాటు, కాస్త ఓపిక కూడా పెట్టుబడిగా పెట్టి పంటను కంటికి రెప్పలా కాచుకుంటే చాలు.