చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Powdery Mildew in Mango and Grapes: మామిడి మరియు ద్రాక్ష తోటలో వచ్చే బూడిద తెగులు యాజమాన్యం.!

1
Powdery Mildew in Grapes
Powdery Mildew in Grapes

Powdery Mildew in Mango and Grapes: బూడిద తెగులు:

కారకం: ఈ తెగులు అయిడియం మాంజిఫెరె అను శిలీంధ్రం వలన కలుగుతుంది.

లక్షణాలు: ఈ తెగులు లక్షణాలు లేత ఆకుల పైన మరియు పూ రెమ్మల పైన తెలుపు లేక గోధుమ వర్ణపు బూడిద లాంటి పదార్ధం వ్యాపించి ఉంటుంది. ఈ బూడిద లాంటి తెలుపు పదార్ధమే తెగులును కలుగజేసే శిలీంద్ర బీజం. సాధారణంగా తెగులు పూవు కాడల చివరి నుండి మొదలై పూవు అంతటా వ్యాపిస్తుంది. తరువాత తెగులు లేత ఆకులకు మరియు కొమ్మలకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన పూవులు వాడి రాలిపోవును. తెగులు సోకిన కాయలు పక్వానికి రాకముందే (ప్రి మెచ్యూర్) రాలిపోవటమేకాక కురూపత కలిగిన కాయలుగా మారటమో లేక కాయలు మామూలు రంగును కోల్పోవటం జరుగుతుంది.

తెగులును కలుగజేసే శిలీంద్ర బీజాలు గాలి ద్వారా పుష్పములు చివర అంటుకుంటాయి. తరువాత ఈ శిలీంద్ర బీజాలు 5 నుండి 7 గంటల లోపల మొలకెత్తుతుంది. వాతావరణం మేఘావృతమైన మబ్బులు కమ్ముకొని ఉండి, ప్రొద్దున సమయంలో మంచు పడటం వలన ఈ తెగులును కలుగజేసే శిలీంద్రము తొందరగా అభివృద్ధి చెందుతుంది. వాతావరణంలో తేమ అధికంగాను మరియు రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండటము వలన తెగులును కలుగజేసే శిలీంద్ర బీజాలు వ్యాసనమునకు తోడ్పడుతుంది.

Powdery Mildew in Mango

Powdery Mildew in Mango

Also Read: Soils For Groundnut Cultivation: వేరుశనగ సాగుకు అనువైన నేలలు.!

నివారణ:

పూత వచ్చే సమయంలో పూత వచ్చిన తరువాత పిందె సమయంలో లీటరు నీటికి నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేదా ఒక మి.లీ. కెరాథీన్ లేదా కాలిక్సిస్ కలిపి 10-12 రోజుల వ్యవధిలో తెగులు. తీవ్రతను బట్టి రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి.

బూడిద తెగులు:

కారకం: ఈ తెగులు అన్నిన్యులా నెకేటర్ అను శిలీంద్రము వలన కలుగుతుంది.

లక్షణాలు: తెగులు లక్షణాలు నేల పైన మొక్క అన్ని భాగాలకు సోకుతుంది. ఆకుల పై రెండు వైపులా తెల్లని పొడి లాంటి పదార్ధం మచ్చలుగా ఏర్పడుతుంది. తెగులు సోకిన ఆకులు వాతావరణం పొడిగా ఉన్నప్పుడు పైకి ముడుచుకుపోతుంది. తెగులు తీవ్ర దశలో తెల్లని పొడి లాంటి పదార్ధం బూడిద లేక నలుపు వర్ణానికి మారుతుంది. లేత దశలో తెగులుకు గురైన మొక్కలలో కాయలు ఏర్పడవు. తెగులు సోకిన కాయలు పక్వానికి రావు. శిలీంద్ర

బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్క పై చేరుట వలన తెగులు వ్యాపిస్తుంది. చలి కాలంలో ఉష్ణోగ్రత 20 నుండి 35. 5°C ఉన్నప్పుడు తెగులు తీవ్రమతుంది.

నివారణ:

తెగులు పోకిన తీగలను కొమ్మలను కత్తిరించాలి.తెగులు నివారణకై నీటిలో కరిగే గంధకపు పొడి 0.2%, హెక్సాకొనజోల్ 1 మి.లీ., పెస్ కొనజోల్ 0.5 మి.లీ., టైడెమిఫాస్ 1 గ్రా. పొటాషియం బైకార్బొనేట్ 5 గ్రా. మందులలో ఒక దానిని పిచికారి చేయాలి.

Also Read: Ranikhet Disease in Poultry: కోళ్లలో కొక్కెర తెగులు ఎలా వస్తుంది.!

Leave Your Comments

Soils For Groundnut Cultivation: వేరుశనగ సాగుకు అనువైన నేలలు.!

Previous article

Rinderpest Disease in Buffaloes: గేదెలలో ముసర వ్యాధిని ఇలా నయం చెయ్యండి.!

Next article

You may also like