Mask for Glowing Skin: ఎండాకాలం వస్తే చర్మం పొడిబారడం, కాంతి హీనంగా అవడం సహజం. అయితే ఇంట్లో మనం తిని పడేసే వ్యర్థ పదార్థాలైన దానిమ్మ మరియు నిమ్మకాయతో చర్మాన్ని కాంతివంతంగా చేసే ఫేస్ మాస్క్ తయారు చేయు విధానం. తాజా దానిమ్మ గింజలను బ్లెండర్లో ఉంచి,గ్రైండ్ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పేస్ట్ తీసుకుని, దానిలో అర టీస్పూన్ తాజా నిమ్మరసం కలుపుకోవాలి.
ఈ పేస్ట్ నీ ముఖం, మెడపై పేస్ట్‌ను రాసుకోవాలి. 20-30 నిమిషాల పాటు ఉండి, ఆ తరువాత సాధారణ నీటితో కడుక్కోవాలి.ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి రెండు నుండి మూడు సార్లు రాసుకోవడం మంచిది.
Also Read: Gir Cow Milk: గిర్ ఆవు పాలకు ప్రజాదరణ పెరుగుతోంది
లాభాలు –
నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అలాగే, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సిట్రిక్ యాసిడ్ చర్మం లోతుకి చొచ్చుకుని పోయి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది.అలాగే చర్మం పై పొర మీద ఉండే మలినాలను తొలగిస్తుంది.
మృత కణాలు, ధూళి, ఇతర మలినాలను చర్మం పై పొరపై పేరుకుని పోవడం వలన చర్మం నల్లగా కనిపిస్తుంది. సిట్రిక్ యాసిడ్ వలన స్వఛ్చమైన మరియు ప్రకాశవంతంగా ఉండే ఛాయ వస్తుంది.
ఎక్స్ఫోలియేషన్ (పీకే గుణం) వలన, సిట్రిక్ యాసిడ్ చర్మ కణాల పునరుత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా సహాయపడుతుంది.విటమిన్ సి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పేర్కొంటారు. కావున హానికర బ్యాక్టీరియా నుండి తటస్తికరణ ద్వారా చర్మాన్ని రక్షిస్తుంది.
UV రేడియేషన్, చర్మం నల్లబడటానికి కారకాలైన ఇతర పర్యావరణ అంశాలకు వ్యతిరేకంగా పనిచేయును. అందువలన చర్మ వ్యాధులు అరికట్టడం చేస్తుంది.
విటమిన్ సి చర్మం యొక్క సహజ పునరుత్పత్తి చర్యను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో దెబ్బతిన్న చర్మ కణాలను రుత్పత్తి చేయడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనితో పాటు విటమిన్ సి చర్మంలో మెలనిన్(నలుపు పిగ్మెంట్) ఉత్పత్తిని తగ్గించే తత్వాన్ని కలిగి ఉంటుంది,కావున చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
విటమిన్ సి చర్మంలో ఉండే కొల్లాజెన్ పరిమాణాన్ని పెంచుతుంది, ఇది మరకలు మరియు మచ్చలను తగ్గించుటకు, చర్మాన్ని మరింత శుభ్రంగా, బొద్దుగా చేయుటకు తోడ్పడుతుంది.
నిమ్మరసం ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉండటం వలన ముఖ ఛాయను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. చర్మంపై నూనె పేరుకుపోవడం వల్ల ముఖం నల్లగా,హీనంగా కనిపిస్తుంది. నిమ్మరసాన్ని చర్మానికి పట్టించడం వలన ముఖంలోని అదనపు జిడ్డును తొలగించి కాంతివంతంగా మెరిసే చర్మాన్ని తయారుచేస్తుంది.
ముఖం పైన ఉన్న పెద్ద రంధ్రాలను తగ్గించడంలో, మచ్చల గుర్తులను తగ్గిస్తుంది. అలాగే చర్మ ఆకృతిని సున్నితపరిస్తుంది.
Also Read: Agriculture Minister Tomar: భారత వ్యవసాయ రంగానికి ఇజ్రాయెల్ తోడు: కేంద్ర మంత్రి తోమర్