Pest Management in Mango – గూడు పురుగు : సీతాకోకచిలుక జాతికి చెందిన ఈ పురుగు తల్లి రెక్కల పురుగులు పెట్టిన గ్రుడ్ల నుండి లేత ఆకుపచ్చ గోధుమ వర్ణపు లార్వాలు ఏర్పదును.
• లార్వా పురుగులు లేత ఆకులను దగ్గరగా చేసి గూడులాగా ఏర్పరిచి అందులో ఉండి ఆకులలోని పత్రహరితాన్ని గోకి తినివేస్తాయి.
దీనివలన ఆకులు మొత్తం ఎండిపోయి చెట్టు బలహీనపడి పూతపై ప్రభావం చూపును.
• ఈ పురుగు కొన్ని సందర్భాలలో గూడు నుండి బయటకు వచ్చి పూత దశలో పూతని తిని విపరీత నష్టం కలుగ జేస్తుంది.
నివారణ చర్యలు:
పురుగు ఆశించి ఏర్పర్చిన గూళ్ళను కర్రలతో విదిలించి క్రిందపడేలా చేసి, సేకరించి కాల్చివేయాలి.
పురుగు మందుల పిచికారి ఆలస్యం చేయకుండా పురుగు ఆశించిన తొలిదశలో, లేత ఆకుల దశలో పిచికారి చేయాలి.
• పురుగు నివారణకు ఒక లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 1-1.5 మి.లీ. ల్యాంగ్డా సైహలో త్రిన్ + 1 మి.లీ డైక్లోరోవాస్ పిచికారి చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ప్రధానంగా ఆంత్రాక్నోస్ నల్లమచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువ.
Also Read: Ethanol Production: జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి.!
ఆంత్రాక్నోస్ తెగులు:
దీనినే పక్షి కన్ను లేదా నల్లమచ్చ తెగులుగా పిలుస్తారు.
ఈ తెగులు మొక్క అన్ని భాగాలు అనగా ఆకులు, పూగెలలు, లేత పిందెలు, పెద్ద కాయలపై ఆశించి నల్లమచ్చలను ఏర్పరుచును.
• దీని వలన ఆకులు, కాయలపై నల్లని మచ్చలు ఏర్పడి ఆకులు, పిందెలు విపరీతంగా రాలిపోతాయి.
కాయలపై మచ్చలు ఉన్నప్పుడు కాయ నాణ్యత దెబ్బతిని మార్కెట్లో సరైన ధర పలుకదు.
నివారణ చర్యలు:
• ఎండిన కొమ్మలు, గుబురు కొమ్మలు మొదలగునవి ఎప్పటికప్పుడు కత్తిరించి కాల్చివేయాలి మరియు రాలిన కాయలను సేకరించి గుంతలో వేసి పూడ్చాలి లేదా కాల్చివేయాలి.
ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ విడిగా లేదా అవసరం మేరకు పురుగు మందులతో కలిపి 2-3 సార్లు వివిధ దశలలో పిచికారి చేయాలి.
పూత పిందె దశలలో నీరుకట్టకూడదనే భ్రమలో చాలా మంది రైతులు ఉంటారు. కాని ఈ దశలో చెట్లకు నీరు సమృద్ధిగా ఇవ్వాలి.
పూత పిందె రాలటాన్ని అరికట్టడానికి ప్రతి 4.5 లీ. వీటికి 1.0 మి.లీ. ప్లానోఫిక్స్ 1-2 సార్లు పిచికారి చేయాలి లేదా 100 లీ. నీటికి 1.0గ్రా., 2,4-డి హార్మోను జాగ్రత్తగా పిచికారి చేయాలి.
Also Read: Vegetable Cultivation: కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ.!