Management of pests in crops:
అధిక వర్షపాతం వలన పలు పంటల్లో చీడపీడలు గమనించడం జరిగింది దానికి అనుగుణంగా సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు.
వరి : కాండం తొలుచు పురుగు ఉధృతికి గమనించడం జరిగింది. దీని నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి 0.3 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి మొలిచిన 10 నుండి 12 రోజుల సమయంలో పిచికారీ చేయాలి. 25 నుండి 30 రోజుల పైరులో కార్భోఫ్యూరాన్ గుళికలను ఎకరానికి 3 కిలోలు ఆకుల సుడులలో వేయాలి.
ఉల్లికోడు గొట్టపు రోగం నివారణకు కార్భోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా గుళికలు 5 కిలోలు వేయాలి.
హిఫ్సా / తాటాకు తెగులు నివారణకు క్వినాల్ ఫాస్ 25 ఇ.సి రెండు మిల్లీ లీటర్లు లేదా ఫ్రోఫెనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 50 ఇ.సి 1.6 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి.
పత్తిలో రసం పీల్చే పురుగులు (పచ్చ దోమ, పేనుబంక, తామర పురుగు నివారణకు థయోమిధాక్సామ్ 0.5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు నివారణకు ధయోడికార్బ్ 75 % డబ్య్లు పి ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు 3 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఫ్యుజేరియం వడలు తెగులు నివారణకు కార్బండిజమ్ ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు బ్లైటాక్స్ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
సోయాచిక్కుడు : సోయాచిక్కుడు పంటలు కాండం తొలిచే ఈగ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు G డైక్లోరోవాస్ ఒక మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కార్భోఫ్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు వేసుకోవాలి.
పెంకు పురుగు నివారణకు ట్రైజోఫాస్ 1.25 మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కొమ్మ ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Also Read: Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!
పొద్దుతిరుగుడు :ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు నివారణకు నోక్యాప్ ఒక మిల్లీ లీటరు లేదా హెక్సాకొనజోల్ ఒక మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆముదం : ఆముదంలో ఫ్యుజేరియం వడలు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు కార్బెండిజమ్ ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పెసర : పెసరలో బూడిద తెగులు నివారణకు హెక్సాకొనజోల్ ఒక మిల్లీ లీటర్లు లీటరు నీటికి / ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజమ్ లేదా G మ్యాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చీడపీడలు నివారించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
-బి. రాజేశ్వరి, ఎం. మాధవి, ఎ. పద్యశ్రీ,
-పి. బిందు ప్రియ, పి.జగన్‌మోహనరావు,
-విత్తన పరిశధోధన మరియు సాంకేతిక పరిజ్ఞానం, రాజేంద్రనగర్, హైదరాబాద్.
Also Read: Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!
Also Watch: