Organic Matter Uses – నేలలోని సేంద్రియ పదార్ధం: నేలలో వేసిన సేంద్రియ పదార్ధము (మొక్కలు, దుబ్బులు, కలుపు మొక్కలు) ను సూక్ష్మ జీవులు ఆహారంగా చేసుకుని అనేక జీవ రసాయనిక ప్రక్రియల ద్వారా “హ్యూమస్” అనే పదార్ధంగా తయారు చేస్తాయి. హ్యూమస్ వాసన లేని, ఊదా రంగు కలిపి పిండి వలె ఉంటుంది. రసాయనం గా హ్యూమస్ కార్బో హైడ్రేట్లు, క్రొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, మైనము వంటి ఇతర పదార్ధాలు మిశ్రమo. ఇది సూక్ష్మ జీవుల వలన పూర్తిగా క్రుళ్ళి హ్యూమస్ గా మారిన తర్వాత ఏ పదార్థం నుండి తయారయినదో తెలియదు.
నేలలో సేంద్రియ పదార్ధాన్ని పెంపొందించుట: పంట కోత అనంతరం నేలలో మిగిలిన దుబ్బులు, పంట నుండి రాలిన ఆకులు, ఇతర సేంద్రియ పదార్ధాలు, కంపోస్టు, పశువులఎరువు అన్నీ నేలలో సేంద్రియ పదార్ధాన్ని పెంచుతాయి.అధిక ఉష్ణ ప్రాంతాల్లో సేంద్రియ పదార్ధం త్వరగా ఆక్సీకరణం చెంది తరిగి పోతుంది. కనుక అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ దఫాలుగా సేంద్రియ పదార్ధాన్ని నేలలో వేయాలి.పంట మార్పిడి లో పచ్చి రొట్ట పైరులను చేర్చి దానిని పూత సమయం లో భూమి లో కలియ దున్ని న సేంద్రియ పదార్ధం క్రుళ్ళిహ్యూమస్ గా మారుతుంది.నేలలో వేసిన సేంద్రియ పదార్ధం చివికి “హ్యూమస్” క్రింద మార్చడం అంతా సూక్ష్మ జీవుల వల్లనే జరుగుతుంది.
ఈ ప్రక్రియ సాధారణంగా నేలలో
(1)తేమ
(2) నేల ఉష్ణోగ్రత,
(3) గాలి ప్రసరణ,
(4) C:N నిష్పత్తి పై ఆధారపడి ఉంటుంది.
Also Read: Vermicompost Beds Preparation: వర్మీకంపోస్టు బెడ్లను తయారు చెయ్యటం ఎలా.!
సేంద్రియ పదార్ధం ఉపయోగాలు: మొక్కల పెరుగుదల కు కావలసిన పోషక పదార్ధాలను అందిస్థాయి.సేంద్రియ పదార్ధము చివికినపుడు ఏర్పడే సేంద్రియ ఆమ్లాలు, బొగ్గుపులుసు వాయువు అనేక పోషక పదార్ధాలు కరిగే లాగ చేసి మొక్కలకు అందిస్తాయి.సేంద్రియ పదార్ధం సూక్ష్మ జీవులకు ఆహారం. సేంద్రియ పదార్ధం తేలిక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచి ఎక్కువ పోషక పదార్ధాలు మొక్కలకు అందిస్తుంది.
అదే విధం గా తేలిక నేలల్లో మురుగు నీరు పోవు సౌకర్యం పెంచి మొక్కలకు పోషకాలను అందిస్తుంది. రసాయనిక ఎరువులు, సున్నం వాడినపుడు కూడా సేంద్రియ పదార్ధం నేల ఉదజని సూచిని తటస్థ స్థాయి లో భాప్సీ భవన నష్టాన్ని (నేలలో తేమ ఆవిరి గా మారడం) తగ్గిస్తుంది.నేల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది.సేంద్రీయ పదార్థం చివికేటప్పుడు ఏర్పడే ఆమ్లాల వల్ల నేల క్షారత్వం తగ్గిస్తుంది. సేంద్రియ పదార్ధం గల నేలలో నీరు ఎక్కువగా ఇంకునట్లు చేసి నేల కోతను తగ్గిస్తుంది.
మట్టి రేణువులు ఒక దాని కొకటి అతుక్కొని ఉండడం వల్ల నేల గుల్లగా తయారయి వాయు ప్రసరణ నీరులోపలి పొరలలోనికి బాగా ఇంకునట్లు చేస్తుంది.సేంద్రియ పదార్ధం ఉన్న నేలలో గాలి కోత వలన మట్టి నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో హ్యూమస్ వున్నందువల్ల ధన అయాన్ల మారక శక్తి పెరిగి పోషక పదార్ధాలను మొక్కలకు అందిస్తుంది.
Also Read: Water Hyacinth Organic Compost Fertilizer: గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు.!