Micro Nutrient Deficiency in Sugarcane: చెఱకు షుమారు 5.60 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 160 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది.చెఱకు పంట ద్వారా పంచదార ,బెల్లం, ఖండసారి ,మొలాసిన్ , ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం,సాగుభూమి , సాగు పద్ధతులు , సస్యరక్షణ , సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి .
ఇనుప ధాతు లోప నివారణ:
సున్నం అధికంగా ఉండే తూర్పు , పశ్చిమ గోదావరి , చిత్తూరు, నిజామాబాద్ జిల్లాల్లో ఇనుప ధాతు లోప నివారణకు ఎకరాకు 2 కిలోల అన్నభేది 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మిద పిచికారి చేయాలి.
Also Read: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు
మాంగనీసు ధాతు లోప నివారణ :
మాంగనీసు లోపం మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల కనిపించింది . మాంగనీసు లోపం చెఱకు మద్య ఆకుల్లో, పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడ్తుంది . ఈ నెల మద్య తెల్లగా మారిన ఆకుభాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి,అవి పెద్దవై , ఒక దానితో ఒకటి కలిసి పోయి,చారలు చారలుగా ఆకు నిలువునా చిల్చినట్లు కనబడతాయి.
మాంగనీసు ధాతు లోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీసు సల్ఫేట్ 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Also Read: చెఱకు పంట లో నీటి యాజమాన్యం