కాలిఫ్లవర్‌ను మనం ఎప్పుడూ తెలుపు రంగులోనే చూసుంటాం. కానీ, పుసుపు, గులాబీ రంగుల్లో ఎప్పుడైనా చూశారా?.. అసలు అలాంటివి ఉంటాయా?.. అనిపిస్తోంది కదూ?.. అవును.. మీరు విన్నది నిజమో.. కాలిఫ్లవర్‌లో కలర్స్ కూడా ఉన్నాయి. అది కూడా మన దేశంలోనే.. మహారాష్ట్రలోని నాశిక్‌లో దభారీ గ్రామానికి చెందిన ఓ రైతు హైబ్రీడ్ కాలీఫ్లవర్‌ను పండించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
అసలు ఇది ఎలా సాధ్యమని అతన్ని అడగ్గా.. 2 నెలల క్రితం 40వేలు పెట్టి కాలిఫ్లవర్ విత్తనాలను కొని.. ఎకరా పొలంలో చల్లాడట. అయితే, పంట వేసిన తర్వాత ఇలా పసుపు, గులాబీ రంగు కాలీఫ్లవర్స్ రావడం మొదలయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే, వీటిని పండించేందుకు పెద్దగా ఖర్చేమీ కాలేదని అన్నారు.
సాధారణ కాలీఫ్లవర్ కంటే.. హైబ్రీడ్ పంటతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఇనుము, A, B, C విటమిన్లు, అయోడిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. తెలుపు రంగులో ఉండే కాలీఫ్లవర్‌ను భారతీయులు విరివిగా వంటల్లో ఉపయోగిస్తుంటారు.
అలాగే, వీటిని కూడా ఎలాంటి సందేహాలు లేకుండా వంటల్లో వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడంలో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని హామీ ఇస్తున్నారు. కాగా, తెల్లగా ఉన్న కాలీఫ్లవర్ దరకే ఈ రంగురంగుల కాలీఫ్లవర్ పలుకుతుందని.. అదనంగా ఎటువంటి ధరలు పెంచే ప్రసక్తి లేదని మహారాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తెలిపారు.