Drip Irrigation: నీరుని నేరుగా పేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయడం వల్ల నీటి వృధాను అరికట్టి 30-50 శాతం వరకు నీటిని పొదుపు చేయవచ్చు.అతి తేలికైన, ఇసుక, బరువైన నల్ల రేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలు గా వుండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూముల్లో కూడా బిందు సేద్య అనుకూలం. సరైన తేమ, సమపాళ్ళలో పోషక పదార్ధాలు సక్రమం గా అందడం వలన మొక్కలు ఏపుగా పెరిగి, త్వరితం గా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు (30-50%) పొందవచ్చు.
నీటి వాడకం తగ్గడం వలన నీరు తోడడానికి అవసరమయ్యే విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. పోషక పదార్ధాలను నీటిలో కరిగించి (ఫెర్టిగేషన్)నేరుగా మొక్కల వ్రేళ్ళకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరిగి (80-90%) దాదాపు 20-40 శాతం ఎరువులు ఆదా అవుతాయి.నేలను చదును చేయడం, కాల్వలు కట్టడం, గట్లు వేయడం, బోదెలు చెయడం.
నీటిని పారించడం లోనే కాకుండా ఎరువులను వేయడం లో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పుడే డ్రిప్ సేద్య ప్రయోజనాన్ని పూర్తిగా పొందే అవకాశముంది.ఎరువు అందించే పోషకాల ఆధారం గా వీటిని మూడు రకాలు గా విభజించ వచ్చు.
నత్రజని ఎరువులు
భాస్వరపు ఎరువులు
పొటాష్ ఎరువులు
Also Read: Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!
నత్రజని: పంటకు అందించే పోషక పదార్ధాల్లో నత్రజని చాలా ముఖ్యం. ఇది సాధారణం గా గడ్డకట్టడం గాని, రంధ్రాలు మూసి వేయడం గాని జరుగదు. ద్రవ నత్రజని ఎరువులను అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్, కాల్షియం నైట్రేట్, అమ్మోనియం ఫాస్పేట్, తో తయారు చెయ్యాలి.
భాస్వరం: సూపర్ ఫాస్పేట్, డై అమ్మోనియం ఫాస్పేట్ (డి.ఏ.పి), బోన్ మీల్, రాక్ ఫాస్పేట్ పై నాల్గింటిలో బోన్ మీల్, రాక్ ఫాస్పేట్ నీటిలో కరుగవు. అందువల్ల వీటిని డ్రిప్ పధ్ధతి లో వాడకూడదు.
సూపర్ ఫాస్పేట్: నీటిలో నెమ్మదిగా కరుగుతుంది. అందువలన దీనిని వాడేటప్పుడు కష్టమవుతుంది. ముఖ్యం గా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే యూరియాను, ఫాస్ఫేట్ ను కలిపినట్లయితే సూపర్ ఫాస్పేట్, ఫాస్పారికి ఆమ్లం గా గా మారి, హానికరం అవుతుంది.. అందుచేత వాటిని విడి విడి గా వాడాలి. యూరియాను వాడేటప్పుడు యూరియా ద్రావణం లో 1-2 శాతం కంటే ఎక్కువ ఉండరాదు.
పొటాష్: ఎరువులైన మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పొటాషియం సల్ఫేట్ లను నీటిలో కలిపి ఇవ్వవచ్చు. సామాన్యం గా ఫెర్టిగేషన్ లో యూరియా, పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, అమ్మోనియం సల్ఫేట్ మరియు నత్రజని, భాస్వరం, interna పొటాష్ మిశ్రమం తో కూడిన ఎరువులను సమర్ధ వంతం గా ఉపయోగించవచ్చు.ఎరువుల పరిమాణం నీటిలో కలిపేటప్పుడు, పంట దశ, పంట ఆవశ్యకత ను పరిగణన లోనికి తీసుకొని కొద్ది మోతాదు. లలో నీటితో ప్రవహింప చేసి మొక్కలకు అందించ వచ్చు. ఈ విధం గా ఎరువులను మొక్కలకు అందించడం వలన రసాయనిక ఎరువుల వాడకం లో మరియు కూలీల ఖర్చు లో ఆదా చేసుకోవచ్చు.
Also Read: Fungal Diseases in Crops: శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్లు మరియు వాటి తెగులు లక్షణాలు.!