Beekeeping: తేనెటీగల పెంపకంలో స్థల ఎంపిక, తేనెటీగల ఎంపిక, యాజమాన్యం ముఖ్యం.
స్థలం ఎంపిక :- పెంపకం ప్రారంభించే స్థలంలో మకరందం, పుప్పొడి అందిచే పుష్పజాతులు తగినంతగా ఉండాలి. చిత్తడి లేకుండా పొడిగా ఉండాలి. విద్యుత్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, రైల్వే ట్రాకులకు దూరంగా తేనెపెట్టెలు పెట్టాలి. దగ్గర్లో స్వచ్ఛమైన పారే నీరు లభ్యమవ్వాలి. పెనుగాలులు, ఈదురు గాలుల నుంచి తేనెపట్టుల రక్షణకు సహజసిద్దమైన లేదా కృత్రిమంగా పెంచిన చెట్లుండాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతంలో సూర్యరశ్మి పడేలా ఉండాలి. వ్యాపార సరళిలో పెంచే తేనెపట్టులు ఒక యూనిట్ నుంచి మరో యూనిట్ కు కనీసం 2-3 కి. మీ. దూరం ఉండాలి. మురికి నీటి గుంటలు, రసాయనాలు తయారుచేసే పరిశ్రమలు, చక్కెర ఫ్యాక్టరీ ప్రాంతాల్లో తేనేపట్లు పెట్టుకోరాదు.
Also Read: Beekeeping: తేనెటీగల పెంపకం ద్వారా రూ.12 లక్షలు సంపాదిస్తున్న దంపతులు
మంచి లక్షణాలున్న తేనేటిగల ఎంపిక:- వీటీలో పుట్ట తేనే తీగలు, ఐరోపా తినేటీగలు, కొండ తేనెటీగలు, చిన్న /విసనకర్ర తేనెటీగలనే 4 రకాలున్నాయి. పరిశ్రమ ప్రారంభించే స్థలంలోని పుష్పజాతులు, రైతుల ఆర్ధిక స్థోమతను బట్టి మొదటి రెండు రకాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఈ పరిశ్రమలో రాణించాలంటే రెండు జాతుల్లోను నాణ్యమైన తేనెటీగలు, ప్రత్యేకంగా రాణి ఈగను బట్టి ఉంటుంది. ఏడాదికి ఒక్కో పుట్ట తేనెపట్టు నుంచి 5-6 కిలోల తేనె వస్తే, ఐరోపా తేనెపట్టు నుంచి 15-20 కిలోల తేనె వస్తుంది. పట్టులను ఒకచోట నుంచి మరో చోటికి మార్చితే ఐరోపా తేనెపట్టుల నుంచి ఇంకా ఎక్కువ తేనె దిగుబడి పొందవచ్చు.
తేనెపట్టుల యాజమాన్యం:- స్థానికంగా లభించే తక్కువ బరువుగల చెక్కతో తేనె పెట్టేల్ని తగిన ప్రమాణాలతో చేయించాలి. అడుగు బల్లను, పిల్లల గదితో కలిపి మేకులు కొట్టరాదు. ఒక నిర్ణీత ప్రాంతాలలో 50-100 దాకా మాత్రమే తేనె పట్టులుండేలా చూడాలి. వరుసల మధ్య 3 మీ. ఎడం ఉండేలా పట్టులను అమర్చాలి. తరచుగా పట్టులను పరిశీలించాలి. చలిగా, మబ్బుగా, గాలి ఉదృతి ఎక్కువ ఉన్నప్పుడు పట్టులను పరిశీలించరాదు. రక్షణ దుస్తులను, ముసుగును ధరించి పట్టులను పరిశీలించాలి. వ్యాధి సోకిన పట్టులను ఆరోగ్యమైన వాటి నుంచి వేరుచేయాలి. తేనెటీగలు కుట్టే స్వభావాన్ని అణచేందుకు అవసరమైతేనే పొగను వాడాలి. లోతులేని పళ్ళలో తాజా నీటిని నింపి ఎల్లప్పుడూ తేనటీగలకు అందుబాటులో ఉంచాలి. పుప్పొడి, మకరందం లభించని కరువు కాలంలో 50 శాతం పంచదార పాకాన్ని ప్రొద్దుగ్రూకిన తర్వాత పట్టులకు అందించాలి.
Also Read: Beekeeping: శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం