Threshing: కోసిన పంట నుండి గింజలను వేరు చేయు విధానo ను ‘పంట నూర్పిడి’అంటారు.
మనుషుల ద్వారా నూర్పిడి చేయు విధానo:
మొదటిపద్ధతి: కోత అనంతరము పంటను చిన్న చిన్న కట్టలుగా చేసుకొని చదునుగా నున్న బల్ల మీదగాని రాతి మీద గాని కొట్టి గింజలను వేరుచేస్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా కోసిన పంట ఎక్కువగా ఉన్న ప్రాంతoలలో చేస్తారు.
రెండవ పద్ధతి: ఒకవేళ కోసిన పంట తక్కువగా ఉన్న యెడల పంటను కల్లములో పరిచి కట్టెలనుపయోగించి కొట్టుట ద్వారా గింజలను వేరుచేయవచ్చు. మనుషుల ద్వారా సుమారుగా గంటకు 15-20 కిలోలు చేయవచ్చు.
పశువుల ద్వారా నూర్పిడి చేయు విధానo:
పంటను కళ్లములో పరచి కల్లము మధ్య అమర్చబడిన గానుగ కొయ్యకు పశువులను వరుసగా కట్టి పంట మీద త్రొక్కుటవలన గింజల నుండి పంట వేరు చేస్తారు. ఈ విధముగా ఎద్దులతో త్రొక్కించుట ద్వారా ఒక గంటకు 100 – 140 కిలోల గింజలు వేరు చేయ వచ్చు.
Also Read: Primary Tillage: ప్రాథమిక దుక్కి ఎప్పుడు చెయ్యాలి.!
ఒక జత ఎద్దులకు పల్లెపు దంతెను కల్లముపై పరచిన పంటపై గుండ్రముగా త్రిప్పుట ద్వారా పంట నుండి గింజలు వేరుచేయ వచ్చు. సాధారణముగా ఈ పద్దతి ఉపయోగించి గోధుమ మరియు వరి పంటలనుండి గింజలను వేరు చేస్తారు.
యంత్రాల ద్వారా నూర్పిడి చేయు విధానం:
పంటను త్వరగానూ తక్కువ ఖర్చుతో మార్చుకొనుటకు వివధ రకాలైన యంత్రాలు అవసరo. ఈ అవసరo నకు తగినట్లుగా అనేకములైన నూర్పిడి యంత్రములు వాడుకలో ఉన్నవి. ఈ యంత్రాలు ఉపయోగించి పంట నుండి గింజలను మూడు విధములైన చర్యల వలన వేరుచేయవచ్చు.
ఆల్పాడ్ నూర్పిడి యంత్రo (Alpod thresher):
గోధుమ, వరి బార్లి పంటను తక్కువ శ్రమతోనూ మరియు తక్కువ ఖర్చుతోనూ నూర్చుకొనుటకు ఈ యంత్రము రూపొందించబడింది. గుజరాత్లోని ఆల్పాడ్ గ్రామoనందు ఒక రైతుచే ఈ యంత్రo రూపొందించబడింది అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిoది.
పనిచేయు విధానo:
ఈ యంత్రo ను కల్లముపై పరచిన పంటపై గుండ్రముగా త్రిప్పుట వలన పంట నుండి గింజలు వేరవుతుంది. ఈ గింజలను తూర్పారపట్టి శుభ్రము పరచాలి. ఈ పద్ధతి వలన సుమారు 16 గంటలలో 600 కిలోల గోధుమలు, 1100 కిలోల గడ్డి తునకలు వస్తుంది.
Also Read: Mechanical Methods for Pest Control: యాంత్రిక పద్ధతులు ఉపయోగించి చీడ పురుగులను ఎలా అరికట్టాలి.!