ఉద్యానశోభమన వ్యవసాయం

Horticulture: పండ్ల తోటల్లో అధిక దిగుబడి రావాలంటే రైతులు ఇలా చెయ్యండి

0
Banana Plant
Banana Plant

Horticulture: భారతదేశంలో పండ్ల పంటల 4 మిలియన్ హెక్టార్లలలో సాగు చేయబడుచున్నది. వీటి ఉత్పత్తి కేవలం 45 మిలియన్ టన్స్ FAO ప్రకారం మన భారతదేశం పండ్ల ఉత్పత్తింలో రెండవస్థానంలో, చైనా ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం పండ్లు మన భారతదేశం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం ఉత్పత్తిలో వినియోగదారునికి చేరకముందే 30 నుంచి 35 శాతం నష్టం జరుగుతుంది.

Banana Plant

Banana Plant

మనదేశంలో చాలా మంది శాఖాహారులు కాని ఉత్పత్తి చాల తక్కువ అందు వలన తాజాపండ్లకు మరియు పండ్ల ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉన్నది. ఎందుకనగా పండ్లలో విలువైన పోషకాలు కలవు. అంతేకాకుండా పండ్ల చెట్లు ప్లాంటేషన్ కూడా భూమిని కప్పుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుటకు దోహదం చేయుచున్నది.

Also Read: దానిమ్మ పంట లో పండ్ల పగుళ్ల లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మనం వేయాలనుకున్న ఫలజాతి కి అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఆ ఆ ప్రాంతంలో వర్షపాతపు తీరు, గాలి ఉధృతం వేడిగాలుల బెడద మొదలైన విషయాలను కూలంకుషంగా పరిశీలించాలి.
  • ఆ ప్రాంతంలోని యితర రైతులు అదే ఫలజాతి తోటలను వేసినట్లయితే వారి అనుభవాలను సేకరించాలి.
  • భూసార పరీక్షలు జరిపించి, వేయబోయే ఫలజాతులకు నేలలు అనుకూలమా కాదా అని నిర్ధారించాలి. నేలలోతు కనీసం రెండు మీటర్లుండాలి, కనీసం 2 మీ., దిగువ నీటి మట్టం ఉంటేనే ఆ నేల పండ్ల తోటల సాగుకు పనికి వస్తుంది.
Horticulture

Horticulture

  • వీలయినంత దగ్గర్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉన్నట్లయితే రవాణా ఖర్చులు తగ్గటమే కాక రవాణాలో కాయ దెబ్బ తినక పండ్లు త్వరగా కొనుగోలు దారుకు చేరే అవకాశం ఉంది.
  • మంచి రోడ్లు, రవాణా సదుపాయాలు, శీతలీకరణ సదుపాయంలో గల ట్రక్కులు అందుబాటులో ఉండాలి.
  • పండ్ల తోటకు దగ్గరలో విద్యుత్ లైను ఉంటే మంచిది.
  • ఇతరులు వేసిన పండ్ల తోటలు దగ్గరగా ఉంటే అనేక సదుపాయాలు సహకార ప్రాతిపదికన తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
  • కావల్సినంత మంది కూలీలు అందుబాటులో ఉండాలి.
  • అంటు మొక్కలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉండాలి.
  • భూమి తక్కువ ఖరీదులో లభించాలి.

Also Read: మామిడిలో పండ్లు రాలడానికి కారణాలు మరియు యాజమాన్య చర్యలు

Leave Your Comments

Soil Conservation: భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత

Previous article

Cattle Breeds: దేశీ జాతి ఆవుల్లో రకాలు మరియు పాల సామర్ధ్యం

Next article

You may also like