Pineapple Farming: యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు ప్రయత్నించిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నారు.సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఉద్యోగులు కూడా రిజైన్ చేసి వాళ్ళ సొంత ఊరిలో, పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. వాణిజ్య పంటు పండిస్తేనే అధికా ఆదాయం వస్తుందని, మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పైనాపిల్ పంటను సాగుచేస్తే మంచి లాభాలని పొందవచ్చు.
పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తుంది. పైనాపిల్ తిన్నడం వల్ల అరుగుదల పెరుగుతుంది. పైనాపిల్‌తో ఔషదాలు తయారు చేయడంలో వాడటం వల్ల మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. పైనాపిల్ వేసవి కాలంలో బాగా పెరుగుతుంది. ఈ పైనాపిల్ సంవత్సరం మొత్తం సాగు చేయవచ్చు.
Also Read: Kadaknath Hen: ఈ కోడి మాంసం కిలో 1200 రూపాయలు.!
కాక్టస్ జాతికి చెందినది ఈ పైనాపిల్ మొక్క. ఈ పైనాపిల్ పంట మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఈ పైనాపిల్ పంటకు ఎక్కువ నీళ్లు అవసరం లేదు. ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులు సంవత్సరం మొత్తం సాగు చేస్తున్నారు. ఈ పైనాపిల్ పంట 18-20 నెలలో కోతకి వస్తాయి. పైనాపిల్ పండు రంగు ఎరుపు నుంచి పసుపులోకి మారినపుడు కోతకి వచ్చింది అన్ని గుర్తించాలి.
ఆయుర్వేద మందుల తయారీలో పైనాపిల్ పళ్లను వాడుతారు. ఈ పైనాపిల్ పండుకి మార్కెట్లో కిలో 150-200 వరకు అమ్ముతున్నారు. రైతులు ఒక ఎకరం పొలంలో పైనాపిల్ పంట వేసుకుంటే 15 టన్నుల పైనాపిల్ పళ్లను పండించుకోవచ్చు. పంట కాలం ఎక్కువగా ఉన్న మార్కెట్లో పైనాపిల్కి ఉన్న రేటు వల్ల రైతులు లక్షల్లో ఆదాయం చేసుకుంటున్నారు.
Also Read: Mahogany: ఈ చెట్లని పెంచండి.. కోటీశ్వరులు అవండి.!