ఉద్యానశోభ

ఇలా కూడా మిద్దె తోట ప్రారంభించొచ్చు !

3
Garden on a Budget

Smart Ways to Garden on a Budget నగరంలో ఎక్కడ చూసినా కాంక్రీటు మయమే. ఓ వైపు పచ్చదనం కనిపించకపోవడం, మరో వైపు రుచి పచి లేని ఎరువులతో పండిన కూరగాయలతో విసుగెత్తిన కొందరు ప్రకృతి ప్రేమికులు మిద్దె తోటల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఓ వైపు ఆరోగ్యం, మరోవైపు వ్యాపకంగా కూడా ఈ మిద్దె తోటల పెంపకం మారిపోయింది. ప్రస్తుతం గమనిస్తే.. పట్ణణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్​పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా రసాయన అవశేషాల్లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మిద్దె తోటల పెంపకంలో శిక్షణ తీసుకుని మిద్దె తోటలు ప్రారంభిస్తున్నారు. వీరి ఉత్సహానికి ఉద్యాన శాఖ కూడా ప్రోత్సాహం అందిస్తుంది. డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపైన, ఇంటి ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఇతర సాంకేతిక సలహాలను అందిస్తోంది. అయితే మిద్దె తోట అంటే అదేదో పెద్ద వ్యవసాయ క్షేత్రం అనుకుంటే పొరపాటే. మన కళ్ళముందు బోలెడు వస్తువులతో మిద్దె తోటను ప్రారంభించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మిద్దె తోటను ఎప్పుడైనా అందుబాటులో ధరల్లో మొదలుపెట్టడం ఉత్తమం. ముందు నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మొక్కల్ని పెంచేందుకు పెద్ద పెద్ద కుండీలు, ఇతర కన్స్ట్రక్షన్ అవసరం లేకుండా చిన్న కాటన్ బ్యాగులు, ఇతర కంటైనర్లలలో మిద్దె తోటను ప్రారంభించొచ్చు.

Garden on a Budget

1. కార్ టైర్లు
2. అట్ట పెట్టెలు
3. పెయింట్ డబ్బాలు
4. వాడేసిన డస్ట్ బీన్స్
5. గ్రో బ్యాగ్స్
6. కొంతమంది వాడేసిన షూ లలోను మొక్కలు పెంచుతున్నారు.

పైన పేర్కొన్న వస్తువులతో అందమైన మిద్దె తోటను ఏర్పాటు చేసుకోవచ్చు. బెండకాయలు, వంకాయలు, తీగ జాతికి చెందిన కూరగాయలు. ఇక మిర్చి, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు ఇలా మనకు దైనందిన జీవితంలో ఉపయోగపడే కూరగాయలు, ఆకు కూరలను పండించుకోవచ్చు. Smart Ways to Garden on a Budget

ఒక వంతు మట్టి, ఒక వంతు వర్మీ కంఫోస్ట్, అందులో కొంచెం వేప పిండి కలిపి మిక్చర్ చేసి మొక్కలకు వేయాలి. వేప పిండి కలపడం ద్వారా మొక్కలకు చీడ పురుగులు పట్టకుండా ఉంటుంది. ఇలా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో అందమైన, ఆరోగ్యకరమైన మిద్దె తోటను ఏర్పరుచుకుంటే చూడచక్కని మిద్దె తోట మీ సొంతం అవుతుంది. అలాగే తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మన సొంతం అవుతుంది. cheap garden ideas

Leave Your Comments

అమెరికాలో తెలుగమ్మాయి సేంద్రియ వ్యవసాయం

Previous article

ఉద్యాన పంటల పొలంలో నిల్వ చేయడానికి ‘పూసా జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్

Next article

You may also like