ఉద్యానశోభ

Vegetable Nursery Preparation: కూరగాయల నారుమడి తయారీ.!

2
Vegetable Nursery Preparation
Vegetable Nursery Preparation

Vegetable Nursery Preparation: కూరగాయల సాగులో నర్సరీ దశ ఎంతో ముఖ్యమైనా నారు ఉత్పత్తి లో కూరగాయల సాగు సగం లాభం పొందినట్లు అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో నారు పెంపకాన్ని కొన్ని కాంపెనిల ద్వారా చేపడతారు. నారు యొక్క ప్రాముఖ్యతను గ్రహీంచి ఆధునికమైనా పద్ధతులను అనుసరించి నారును పెంచుతున్నారు. ఆరు బయట సాగు చేసే నారుమడులను ఎప్పుడు ప్రత్యేకమైన ఎత్తు నారు మాడుల్లో లేదా నారు నర్సరీ ట్రేలలో తయారు చేస్తున్నారు.

తీగ జాతి కూరగాయలు చిక్కుడు, ఫ్రెంచి చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దగా ఉంటుంది.కాబట్టి వీటిని పొలంలో నేరుగా విత్తుకోవచ్చు .విత్తన పరిమాణం చిన్నగా ఉన్నటువంటి టమాటో, వంగ,క్యాబేజి, క్యాలిఫ్లవర్, మిరప, ఉల్లీ లాంటి పంటలలో , ముందుగా నారు మాడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

నారు మడుల పెంపకం: నారు మాడులు పెంచే స్థలం గాలి, వెలుతురు ఎక్కువగా ఉండి నీటి వసతికి దగ్గరగా ఉండాలి. నేలను 3-4 సార్లు బాగా దుక్కి దున్నీ మంచిగా చదును చేయాలి.4 మీ. లి. పొడవు 1 మీ. వెడల్పు 15 సేం. మీ ఎత్తు గల మల్లను తయారు చేసుకోవాలి.

Vegetable Nursery Preparation

Vegetable Nursery Preparation

Also Read: Barseem grass Cultivation: బర్సీమ్ గడ్డి సాగు.!

ఈ విధంగా 40 చ. మీ స్థలం లో పెంచిన నారు ఒక ఎకరాకు సరిపోతుంది. ఏతైన నారు మాడుల వలన నారు నిల్వ కుండా కిందికి జరిపోతుంది. దీని వల్ల నారు కుళ్ళు తెగులు నివారించబడుతుంది.ఈ మళ్లను తెల్లటి పాలిథిన్ కాగితంలో కప్పి రెండు వారల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వేడికి సరి చేయుట వలన నేలలోని శిలీంద్రాలు చాలా వరకు చనిపోతాయి. 40 చ. మీ నారు మడికి 40 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువును,2 కిలోల అజోస్పైరైల్లం లేదా అజాటోబాక్టర్ కలపాలి. నారు మాడులలో విత్తన శుద్ధి చేసి విత్తనాలను 10 సేం. మీ ఎడంలో వరుసలో 1-2 సేం. మీ లోతులో విత్తాలి. విత్తిన తర్వాత సన్నని ఇసుక, మట్టి,మాగిన పశువుల ఎరువును కలిపిన మిశ్రమంతో కప్పాలి.

విత్తనాన్ని చాలా పలుచగా విత్తుకోవడం వలన మొక్కలకు గాలి బాగా తగిలి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది.దగ్గరగా గుంపులుగా పెరిగే సన్నని నారు పొడవుగా పెరగడమే కాక గాలి బాగా తగలక నారు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఆ తర్వాత విత్తనాలు మొలకెతై వరకు రోజ్ క్యాన్ ద్వారా రోజు నీటి తడులు ఇవ్వాలి. నారు మళ్ళను శుభ్రమైన ఎండు గడ్డితో కప్పాలి. విత్తనం మొలకెత్తనట్లు మొదటి అంకురం కనపడగానే పైన కప్పిన గడ్డి పోరను తీసి వేయాలి.ఒక వరుసలో 60-65 మొక్కలు ఉండేలా చూసినచో ఆరోగ్యమైనా నారును పొందవచ్చు.

Vegetable Nursery Production

Vegetable Nursery Production

నారు మళ్లలో కలుపును వెంటనే తీసివేయాలి. రసం పీల్చు పురుగులు మరియు ఆకు మచ్చ తెగుల నివారణకు మాలధియన్ లేదా డైమీతోయేట్ 2 మీ. లి. కలిపి పిచికారీ చేయాలి.నారు కుళ్ళు తెగులు కనిపించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటికి మొక్క తడిచేలా పిచికారీ చేయాలి. నారు మొక్కలు త్వరగా పెరుగడానికి నత్రజని అధికంగా లేదా ఎక్కువగా నీటి తడులు ఇవ్వకూడదు. నారు పీకడానికి వారం ముందు నీటి తడులు ఆపి నారు మొక్కలు గట్టిపడేలా చూడాలి.నారు మొక్కలు పీకడానికి 6-12 లోపు నీరు పెట్టి నారు మళ్లను పీకాలి.ప్రధాన పొలంలో చీడపిడలు ఆశించే ముందు డైమీథోయేట్ పిచికారీ చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి.

Also Read: Organic Matter Uses: సేంద్రియ పదార్ధంతో ఎన్నో ఉపయోగాలు.!

Leave Your Comments

Barseem grass Cultivation: బర్సీమ్ గడ్డి సాగు.!

Previous article

Cauliflower Physical Defects: క్యాలిఫ్లవర్ లో భౌతిక లోపాలు – వాటి నివారణ.!

Next article

You may also like