ఉద్యానశోభమన వ్యవసాయం

Pigment Methods in Pomegranate: దానిమ్మలో కాయరంగు పెంచే పద్ధతులు.!

1
Pomegranate
Pomegranate

Pigment Methods in Pomegranate: నేలలు – దానిమ్మ అనేక నేలల్లో సాగు చేయవచ్చు. మిగతా పండ్ల చెట్లను సాగుచేయలేని నేలల్లో కూడా పంట పండించువచ్చు. సున్నం ఎక్కువ గల భూముల్లోను, కొద్దిగా క్షారత అధికంగా ఉన్న భూముల్లో కూడా దానిమ్మ సాగుచేయవచ్చు. లోతైన గరప నేలలు, ఓండ్రు నేలలు మిక్కిలి అనుకూలం.

రకాలు:

1. గణేష్: ఈ రకంలో కాయలు పెద్దదిగా ఉండి ఆకర్షణీయమైన పింక్ కలర్ రంగులో వుండి పసుపు వర్ణం చర్మంను కలిగిఉండును. విత్తనాలు మృదువుగా ఉండి తీయని గుజ్జు కలిగిఉండును. గుజ్జు శీతాకాలంలో ఆకర్షణీయన పింక్ కలర్లోను, వేసవి కాలంలో వైట్ కలర్లోను ఉండును. కాయ సగటు బరువు 200-250 గ్రాములు.

2. మృదుల (అరక్తా): ఈ రకంలో పండ్లు గుండ్రంగా క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండి ఆకర్షణీయమైన చక్కని రెడ్ కలర్లో వుంటాయి. మృదుల పండ్లలో గింజలు లావుగా వుండి మృదువైన విత్తనంతో పాటు కంటికి ఇంపైన ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు ఎక్కువ రసభరితంగా, మధురమయిన తీపిరుచిని కలిగి ఉంటాయి. ఈ దానిమ్మ గింజలను సలాడ్గాను తాజ పండ్ల రసంగా వాడతారు. కాయ సగటు బరువు 250-300 గ్రాములు గణేష్ రకం కంటే ఆంత్రాక్నోస్ మచ్చరోగాన్ని బాగా తట్టుకొనే ఈ రకం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

Pigment Methods in Pomegranate

Pigment Methods in Pomegranate

Also Read: Pruning in Pomegranate: దానిమ్మ లో కొమ్మ కత్తిరింపు లతో లాభాలు.!

బహార్ ట్రిట్మెంట్:

అంబేబహార్ సీసన్ కొరకు నవంబర్ ఆఖరి వరకు నీటి తడులు ఆపి డిసెంబర్-జనవరి మాసాల్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జూన్-జూలై మాసాల్లో పండ్లు కోతకు వస్తాయి.

మ్రిగ్ బహార్ సీసన్ కొరకు డిసెంబర్-ఏప్రిల్ వరకు చెట్లకు విశ్రాంతి నిచ్చి ఆ తర్వాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెట్టాలి. జూన్-జూలై మాసాలో చెట్టు పూతకు వచ్చి అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోతకు వస్తాయి. బహార్ ట్రీట్మెంట్ యిచ్చిన నెలరోజుల్లో చెట్లు పూతకు వస్తాయి. తర్వాత 5 నుండి 6 నెలల్లో పండ్లు కోతకు వస్తాయి.

కాయ రంగు పెంచే పద్ధతులు:

కాయ తయారు అయ్యే సమయంలో ఉష్ణోగ్రత అధికం ఉన్నప్పుడు గణేష్ రకంలో కాయరంగు పేలవంగా ఉంటుంది. అధికం నత్రజని ఎరువుల వాడకం, నీటి తడులు, మరియు భూమిలో మెగ్నీషియం ఎక్కువగా వేసినప్పుడు కూడా కాయలు పేలవంగా తయారవుతాయి. కాయలు పక్వాని కి వచ్చే కొచ్చే దశలో పొటాషియం అధిక మోతాదులో అవసరం ఉంటుంది. అవసరాన్ని భర్తీ చేయుటకు 2 గ్రా., పొటాషియం డై హైడ్రోజన్ ఆర్థోఫాస్పేట్ లీటరు నీటికి కలిపి రంగు మారే దశలో పిచికారీ చేయాలి or 15 రోజులు వ్యవధిలో 2 సార్లు 500 ppm మోతాదులో లిహెూసి పిచికారి చేయాలి. దీనితో పాటు 500 ppm ఇథిరిల్ పిచికారి చేసి గాని, సైటోమ్ 100 ml + 100 గ్రా. పొటాషియం డై హైడ్రోజన్ ఆర్థో ఫాస్ఫేట్ 100 లీటర్ల నీటికి కల్పి పిచికారి చేసి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కాయలు సంతరించుకొనేలా చేయవచ్చు.

Also Read: Pomegranate Fruit Borer: దానిమ్మ లో కాయతొలుచు పురుగు నివారణ చర్యలు.!

Leave Your Comments

Aloe vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు.!

Previous article

Turkey Poultry Farming: లాభ సాటిగా టర్కీ కోళ్ళ పెంపకం.!

Next article

You may also like