ఉద్యానశోభ

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి..

2
Dragon Fruit Cultivation
Dragon Fruit Cultivation

Dragon Fruit: ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ చాలా ఎక్కువగా వింటున్నాము. కరోనా ముందు వరకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎవరికి తెలియదు. కానీ డ్రాగన్ ఫ్రూట్ మన దేశంలో 1980 నుంచి ఈ పండు సాగు చేయడం మొదలు పెట్టారు. గుజరాత్ ,మహారాష్ట్ర రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలు పెట్టారు. తర్వాత అని ప్రాంతాల్లో సాగు చేయడం మొదలుపెట్టారు. డ్రాగన్ ఫ్రూట్ని ఎక్కువ మంది రైతులు సాగు చేయకపోవడానికి ముఖ్య కారణం ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సివస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్లోని లాభాలు చూశాక ఇప్పుడు చాలా మంది రైతులు సాగు చేయడం మొదలు పెడుతున్నారు. మార్కెట్లో కరోనా తర్వాత ఈ పండ్లకి మంచి డిమాండ్ ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్మునిటి, ప్లేట్లెట్ కౌంట్, బ్యాలన్స్, బ్లడ్ పురిఫికేషన్ కూడా డ్రాగన్ ఫ్రూట్ చేస్తుంది.

ఈ పంట పండించడానికి పూర్వ అనుభవాలు లేకపోవడంతో రైతులకి ఈ పంట పండించడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ పంట అని పంటల సాగు చేయలేము. ఈ పంట గురించి మహారాష్ట్రలోని ఒక రైతు పరిశీలించి ఈ పంటని వ్యవసాయ యాంత్రికరణతో చేయడం మొదలుపెట్టారు. దానితో ఈ పంట పండించడం ఇప్పుడు రైతులకి చాలా సులువుగా మారింది.

Also Read: Bougainvillaea: ఈ పూవ్వులతో లక్షలు సంపాదించుకోవచ్చు..

Dragon Fruit Cultivation

Dragon Fruit

ఇప్పుడు రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంటని సేంద్రియ పద్దతిలో కూడా పండించడం మొదలు పెట్టారు. ఈ పండును పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తిన్నడంతో మార్కెట్లో కూడా ఈ పంటకి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ పంటని డ్రిప్ ఇరిగేషన్తో సాగు చేయడం ద్వారా నీటి వినియోగం తగ్గించవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ పువ్వులలో కూడా చాలా పోషకాలు ఉండడంతో వీటి నుంచి తేనె తీసి మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టారు. ఈ తేనలో పోషకాలతో పాటు వైద్యానికి కూడా ఈ తేనని వాడుకోవచ్చు. ఇన్ని మంచి గుణాలు ఉండటంతో ఈ తెనకి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటని సూపర్ మార్కెట్, వ్యవసాయ కంపనీలతో కాంట్రాక్టు పద్దతిలో రైతులు సాగు చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి.

Also Read: Minister Niranjan Reddy: వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి – మంత్రి

Leave Your Comments

Bougainvillaea: ఈ పూవ్వులతో లక్షలు సంపాదించుకోవచ్చు..

Previous article

Agricultural Scientist: పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న అగ్రికల్చర్ విద్యార్థులకి శుభవార్త..

Next article

You may also like