Custard Apple Varieties: సీతాఫలం పండ్లు అందరికి బాగా తెలిసిన పండు. ఈ పండ్లు ఎక్కువగా గుట్ట ప్రాంతాల్లో , కొండల్లో, రోడ్ల పక్కన , పొలం గట్లలో ఉండేవి. ఈ పండ్లు కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చాక ఈ చెట్లు పెద్దగా కనిపించడం లేదు. ఈ పంట ద్వారా కూడా ప్రస్తుతం రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. సీతాఫలం పండ్ల చెట్లల్లో రెండు కొత్త రకాలు ఉన్నాయి. ఈ రకాలని గ్రాఫ్టింగ్ ద్వారా తయారు చేశారు.
ఈ రెండు రకాలని బాలానగర్, సూపర్ గోల్డ్ అని పిలుస్తున్నారు. బాలానగర్ వెరైటీ మొక్కలో చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఈ మొక్క గ్రాఫ్టింగ్ పద్దతిలో సాగు చేశారు. ఈ రకం మొక్కని నాటిన రెండు సంవత్సరాల తర్వాత పంట దిగుబడి వస్తుంది. ఈ మొక్క జూన్ లేదా జులై నెలలో పూతకు వస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కోతలు కోసుకోవచ్చు.
రెండో రకం సూపర్ గోల్డ్ రకం. ఈ మొక్క కూడా గ్రాఫ్టింగ్ పద్దతిలో సాగు చేశారు. ఈ రకం మొక్కలను నర్సరీలో ఆరు నెలలు పెంచి రైతులకి ఇస్తారు. మొక్క నాటిన తర్వాత రెండు సంవత్సరాలు రెగ్యులర్గా ట్యూనింగ్ చేయాలి. ఈ మొక్కలని ఏపుగా పెరిగేలా పెంచాలి. ఎక్కువ కొమ్మలు వస్తాయి ఈ రకం మొక్కలో. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక ఈ చెట్ల నుంచి దిగుబడి రావడం మొదలు అవుతుంది.
Also Read: Tomato Farmer Murder: రైతుల ప్రాణాలకి ముప్పుగా మారిన టమాట ధర.!
మూడో సంవత్సరం నుంచి ఈ మొక్కలకి నీటిని ఇవ్వకూడదు. ఎండాకాలంలో ఈ మొక్కలు పూర్తిగా రెస్టింగ్ మోడ్లోకి వెళ్తాయి. ఈ కాలంలో ఎక్కువగా ఆకులు రాలిపోతాయి. మే నెలలో ఆకులని కత్తరించాలి. జూన్ నెలలో వర్షాలు రావడంతో ఆకులు చిగురించి మళ్ళీ పూత రావడం మొదలు అవుతుంది. ఈ రకం చెట్లులో స్వీయ పరాగసంపర్కం జరుగుతాయి.
సూపర్ గోల్డ్ రకంలో నవంబర్ నెలలో కోతలు మొదలు అవుతాయి. జనవరి నెల ఆకరిలో కోతలు పూర్తి అవుతాయి. ఈ రెండు రకాలకు కేవలం పూత వచ్చే సమయంలో మాత్రమే నీటిని ఇవ్వాలి. ఆ తర్వాత ఈ పంటకి ఎలాంటి నిర్వహణ పనులు ఉండవు. ఈ చెట్లకి పిండి నల్లి బెడద ఎపుడైనా ఉంటే ఒక లీటర్ నీటిలో 5 గ్రాముల సున్నం కలిపి చెట్లకి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పిండి నల్లి పూర్తిగా తొలగిపోతుంది.
సీతాఫలం పండ్లని పొలం దగ్గరే కొనుకుంటే రైతులు కిలో 50 రూపాయలకి అమ్ముతున్నారు. వ్యాపారులు పొలం దగ్గర కొనుగోలు చేసి మార్కెట్లో ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. మార్కెట్లో కిలో 100-150 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ చెట్లకి కేవలం నాలుగు నెలలు నీళ్లు, ఎరువులు ఇస్తే చాలు, ఆ తర్వాత ఈ చెట్లకి నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక ఎకరంలో ఈ పండ్లను సాగు చేస్తే ఒక సీజన్లో 2-3 లక్షల లాభాలు వస్తాయి.
Also Read: Ajwain Cultivation: ఎకరా వాముకు పెట్టుబడి రూ 7 వేలు, లాభం రూ 60 వేలు