Lily Cultivation: సుగంధ భరిత వాసనలను వెదజల్లే లిల్లీ పూలను తెలుగు రాష్ట్రాలలో సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈపూలను పూలదండల తయారీలో విరివిగా వాడుతారు. తక్కువ పూలతో సులభంగా, అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మంచి గిరాకీ ఉంటుంది. పట్టణ నగర ప్రాంతాల్లో లిల్లీ పూలకాడలను బొక్కెల తయారీకి ఎక్కువ ఉపయోగిస్తారు. మంచి వాసన ఉండటంతో ఈ పూల కాడలను ఇళ్లు, కార్యాలయాల్లో అలంకరణ కోసం ప్రజలు విరివిగా వాడతారు. లిల్లీ పూల నుంచి సుగంధ తైలం కూడా తయారు చేస్తారు.
ఒక తైలం ధర విదేశీ మార్కెట్లో కిలోకు లక్షకు పైనే ఉంటుంది. రైతులకు రోజువారి ఆదాయం కూడా లభిస్తోంది. ఒకసారి నాటిన లిల్లీ పంట నుంచి మూడేళ్ల వరకు నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చు. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంట సాగకు కూలీలు సాకు ఖర్చులు తక్కువే. తక్కువ విస్తీర్ణంలో కూడా మంచి ఆదాయం పొందే వీలుంటుంది
లిల్లీ సాగు రైతులకు చాలా లాభదాయకం
లిల్లీ పంటలో పూల నాణ్యత, దిగుబడి, రైతు మొక్కలకు చేసే పోషణ, చేపట్టే సస్యరక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. రైతులు చేపడుతున్న సాగు విధానం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అన్ని పంటల్లో లాగే లిల్లీ పంటలో కూడా పోషక లోపాలు, చీడపీడల బెడద ఎక్కువగానే కనిపిస్తోంది, ఈ అంశాల పైన రైతులు జాగ్రత్తగా ఉంటే లిల్లీ సాగు రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే రైతులు దుంపల ద్వారా ఈ పంటను సాగు చేస్తారు. నీరు నిలబడక సులభంగా ఇంకిపోయే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న గరప ఒండ్రు భూములు సాగుకు అనుకూలం.
Also Read: చలికాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Lily Cultivation
పూల నాణ్యత. దిగుబడి
సాధారణ సాగు పరిస్థితుల్లో ఎకరాకు 5 నుంచి 5.5 టన్నుల పూల దిగుబడి వస్తుంది. మార్చి ఏప్రిల్ వరకు పూలు ఎక్కువగా వస్తాయి. అయితే ఎండ తీవ్రత అధికమైనప్పుడు దిగుబడి మాత్రం తగ్గిపోతుంది. మొదటి ఏడాది సాగు ఖర్చు ఎకరాకు 80000 నుంచి లక్ష వరకు అవుతోంది. రెండో ఏడాది సాగు ఖర్చులు రూ. 40 వేల నుంచి రూ50 వేలు అవుతుంది. పూలను మధ్య దళారుల ద్వారా అమ్మితే కిలోకి రూ.50 నుంచి రూ60కి గిట్టుబాటు అవుతుంది. రైతు సొంతంగా అమ్ముకుంటే కిలోకి రూ. 75 నుంచి రూ90 వరకు లాభం లభిస్తుంది.
సాధారణ పరిస్థితుల్లో ఏడాదికి ఎకరాకు రూ. 2.5 లక్షల నుంచి మూడు లక్షల వరకు మొత్తం ఆదాయం రాగా, ఖర్చులు పోను సగటున రైతుకు రెండు లక్షల వరకు తగ్గకుండా ఆదాయం సమకూరుతుంది. ఈ రకంగా రైతులు సొంతంగా కుటుంబ సభ్యులతో సాగు చేసుకుంటే 25 సెంట్లు భూమిలో కూడా ఏడాదికి 50 వేల వరకు నిక్కర ఆదాయం పొందవచ్చు. అందుకే ఈ పంట సన్న చిన్న కారు రైతులకు చాలా అనువైనదిగా చెప్పవచ్చును.
Also Read: తీపి జొన్న సాగు తో రెట్టింపు ఆదాయం.!