సీజన్ వస్తుందంటే చాలు కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తోచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం అమృత ఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్ యాపిల్ అని పండ్ల దొర అని షుగర్ యాపిల్ పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఈ సీతాఫలాలు సమృద్ధిగా ఉండే పోషక విలువలు గర్భిణీ స్త్రీలకు ఎంతో దోహదపడతాయి. సీతాఫలాల సీజన్ వచ్చేసింది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ప్రారంభమయ్యే సమయంలో అటవీ ప్రాంతాల్లో అధికంగా లభించే ఈ సీజన్లలో గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక అలసట, ఒళ్ళు నొప్పులు తగ్గి పిండానికి అవసరమైన పోషకాలన్ని పొందవచ్చు. ఇక మిగతా అదనపు పోషకాల అవసరం ఉండదు. విటమిన్లు వేసుకోవడం డబ్బు దండగ వ్యవహారం.
ఈ ఫలం లో 100 గ్రా. నుంచి 94 క్యాలరీల శక్తి, 20 – 25 గ్రా. పిండిపదార్థాలు 2.5 గ్రాముల ప్రోటీన్లు, 4.4 గ్రాముల పీచు లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్, థయమిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ – సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
Also Read : గ్రామీణ స్త్రీలు – ఆహార సూత్రాలు
అలాగే ఇందులో ఐరన్, కాపర్, మేగ్నేషియంవంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. కాపర్ శరీరానికి చిన్న మోతాదులో అవసరమైనప్పటికీ శరీర విధులను సక్రమంగా సాధారణ స్థితిలో జరగడానికి ఇది అవసరమౌతుంది. శరీరంలోని ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలోను ఇది సామాన్య ఖనిజం అయినప్పటికి గర్భ స్రావం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రతి గర్భవతి స్త్రీకి 100 మి . గ్రా కాపర్ లభ్యం అవ్వటంతో అకాల పిండ ప్రసవం అవటాన్ని నిరోధించే శక్తి కలిగి ఉంటుంది. దానితో పాటుగా గర్భాన్ని ఆరోగ్యవంతంగా ఉంచటంలో ప్రత్యేక ప్రాముఖ్యత వహిస్తుంది. అంతే కాకుండా ప్రసవ నొప్పిని తగ్గిస్తుంది. మెగ్నీషియం శరీరంలోని ఎముకల నిర్మాణానికి, కండరాలు, నరాల విధులను నిర్వహించడానికి ముఖ్యమైంది. గర్భిణీ స్త్రీలు తరచుగా విటమిన్ – డి లోపం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎముకలో జరిగే జీవరసాయన ప్రక్రియలన్నిటిలో మెగ్నీషియం చాలా అవసరం. అల్కలైన్ ఫాస్ఫేట్ కి మేగ్నిషియం క్రియాశీలత నిస్తుంది. ఇది కొత్త ఎముకల పలుకులు ఏర్పడటానికి అవసరమైన ఎంజైమ్ అత్యధిక క్రియాశీలతను పొందేటట్టుగా రూపుదిద్దుకోవడానికి విటమిన్ – డికి కూడా మేగ్నిషియం ఆవశ్యకత ఎంతైనా ఉంది. మెగ్నీషియం కొరత, విటమిన్–డి ని నిరోధించి అనేక రోగ లక్షణాలని పుట్టే శిశువు లో కలిసే అవకాశం ఉంది. ఉదాహరణగా పిటిరియాసిస్ ఆల్బా తినే తెల్లని పాచెస్ ముఖాల ,మీద ఏర్పడటం కాపర్, నిజం అని 141 ఐరన్ మెగ్నీషియం లోపం వల్లే అని వైద్యనిపుణుల అంచనా.
గర్భిణీ స్త్రీలను మొదటి నెలలు నుండి మలబద్ధకం తీవ్రంగా ఉండటం ఒక సహజ లక్షణం. సీతాఫలంలో తగిన మోతాదుల్లో పీచు లభ్యం కావడంతో మలబద్దకం సమస్యలు తగ్గుముఖం పడతాయి మరియు మలం మృదువుగా చేసి ప్రేగు కదలికలను మెరుగు పరుస్తుంది.
ఈ అమృత ఫలంలో పిండి పదార్దాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో లభ్యంమవడం వల్ల గర్భిణీ స్త్రీలు ఈ ఫలాన్ని తినడం వల్ల గర్భంలో ఉండే పిండానికి సంబంధించిన చర్మం, స్నాయువులు, రక్తనాళాలు అభివృద్ధి చెందడం దోహదపడతాయి.
గర్భిణీ స్త్రీలలో రక్తపోటులో హెచ్చుతగ్గులు సామాన్యమైనప్పటికీ దీర్ఘకాలికంగా గర్భాశయంలో ఉండే పిండానికి తల్లికి హాని కలుగ చేసే అవకాశం ఉంది. సీతాఫలం సేవించడం వలన పొటాషియం మరియు మెగ్నీషియం వంటి స్థూల ఖనిజాలు రక్తపోటును నియంత్రించే గలిగే శక్తి కలిగి తల్లీబిడ్డలు సురక్షితంగా ఉండటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జాతికి చెందిన అనేక రకాలు అయిన బాలానగర్, అటిమోయా,పెలాండ్ జెమ్, అటిమోయా, బాలానగర్ హబ్రిడ్, రెడ్ సీతాఫలం సాగుకు యోగ్యమైన , బాలానగర్ హైబ్రిడ్, లాంటి రకాలు వాణిజ్య పరంగా ప్రాముఖ్యత వహించటంతో. దీని సాగు విధానంలో సమగ్రమైన సలహాలు అందించి రైతు సోదరులకు చేయూత ఇవ్వడం వల్ల వ్యర్ధ భూమిని (నిసారమైన నేలలని) కూడ వినియోగించుకొని పండ్ల కాలానుగత లభ్యత పెంచడం ద్వారా పాలిచ్చే తల్లులకు పోషక భద్రతను చేకూర్చవచ్చు.
డా . జె శంకరస్వామి, ఉద్యాన కళాశాల , మాజెర్ల
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ విశ్వ విద్యాలయం
Also Read : రబీ ఉలవలు సాగు – యాజమాన్యము