Anjeer fruit Drying Process: ఈ మధ్య కాలంలో అంజీర పండ్లని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ అంజీర పండ్లకి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా వీటిని పండించడానికి ఇష్టపడుతున్నారు. అంజీర పండ్లకి ఎంత డిమాండ్ ఉందొ డ్రై అంజీరకి కూడా మార్కెట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ డ్రై అంజీరకి మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉండటంతో అనంతపురం జిల్లా రమేష్ నాయుడు రైతు తన పొలంలో ఈ పండ్లని డ్రై చేసుకోవడానికి చిన్న పాలీ హౌస్ కట్టుకున్నాడు. ఈ డ్రై అంజీర అమ్ముకోవడం ద్వారా మంచి లాభాలని కూడా పొందుతున్నారు.
ఈ పాలీ హౌస్ 18 అడుగుల వెడల్పు, 32 అడుగుల పొడవులో కట్టుకున్నారు. దీనిని ఇనుప రాడ్స్, పాలిథిన్ కవర్తో కట్టారు. ఈ పాలీ హౌస్ కట్టడానికి లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 4-6 ఫాన్స్ పెట్టుకోవాలి, రెండు ఎగ్జాస్ట్ ఫాన్స్ పెట్టుకోవాలి. పాలీ హౌస్లో బయట ఉష్ణోగ్రత కంటే 10-15 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
Also Read: Sugarcane Knots: చెరుకు గడలే విత్తనాలుగా వాడుకోవడం ఎలా..?
ఇందులో ఇనుప మంచాల పై ఈ అంజీర పండ్లని ఆరపెట్టాలి. మొదటి రోజు ఈ పండ్లని ఆరపెట్టక వాటి చివరి అంచులు కత్తరించుకోవాలి. అంజీర పండ్లని ప్రెస్ చేసి మళ్ళీ ఆరపెట్టాలి. వీటిని 7-8 రోజులు ఆరపెట్టాలి. 4 కిలోల అంజీర పండ్లని ఆరపెడితే ఒక కిలో డ్రై అంజీర వస్తుంది. బయట ఎండలో ఆరపెట్టడం వాళ్ళ పండ్లు ఆరడానికి ఎక్కువ కాలం పడుతుంది.
ఇలా పాలీ హౌస్ ద్వారా పండ్లని ఆరపెట్టుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. పాలీ హౌస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, వేడికూడా సమానంగా వ్యాపిస్తుంది, దీని వల్ల తొందరగా డ్రై అవుతాయి. అంజీర పండ్లు మార్కెట్లో కిలో 100 రూపాయలు అమ్ముతే, ఈ డ్రై అంజీర కిలో 1000-1200 వరకు అమ్ముకుంటున్నారు. ఈ డ్రై అంజీర అమ్ముకోవడం ద్వారా రైతులు చాలా లాభాలు పొందుతున్నారు.
Also Read: Summer Banana Garden: ఎండాకాలం అరటి తోటని ఎలా ప్రారంభించాలి.?