Horseshoe Crab: కాలానుగుణంగా వింత వింత రోగాలు పుట్టుకొస్తున్నాయి. అందుకోసం వైద్య శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ వచ్చిన రోగానికి టీకాలు తయారు చేస్తున్నారు. ఇటీవల ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ కూడా ఈ కోవకి చెందిందే. అయితే మన శరీరంలోకి పంపించే టీకా , నరాల ద్వారా ఎక్కించే మందుల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా.. వాటిలో బ్యాక్టీరియా ఉందా.. అనేది తెలియాలంటే పీత రక్తం ద్వారానే తెలుస్తుందట. అందుకే పీతల రక్తానికి అంత డిమాండ్ మరి. పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షల పైమాటే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మార్కెట్ లో పీతల రక్తం లీటర్ ధర రూ.12లక్షలకు పైగా పలుకుతుంది.
హార్స్‌షూ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వాటిని సేకరించడం, రక్తాన్ని బయటకు తీయడం కష్టతరమైన పనిగా చెప్తున్నారు. కొన్ని ప్రత్యేక పద్దతుల్లో గుండె నుంచి వచ్చే రక్తనాళాల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తం నుంచి రక్తకణాలను వేరుచేసి ఎల్ఏఎల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఎల్ఏల్‌కు సూక్ష్మమైన హానికర బ్యాక్టీయాను సైతం గుర్తించే శక్తి ఉంటుంది. తయారు చేసిన వ్యాక్సిన్‌లో ఎల్ఏఎల్ ద్వారా పరీక్షించి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్నాకే ఆ వ్యాక్సిన్‌ను బయటకు పంపుతారు. ఈ కారణంగానే వీటి రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షల పైనే ఉంటుందని చెప్తున్నారు వైద్య పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం కోసం వెచ్చిస్తున్నాయంటే హార్స్‌షూ పీతల రక్తానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
Also Read: నర్సరీ పీతల పెంపకంలో యజమాన్యం.!
నిజానికి పీతలు తాబేలు ఆకారాన్ని పోలి ఉంటాయి. దానిపైన ఉన్న డొప్ప మాదిరిగా తలభాగం పది కళ్లను హార్స్ షూ క్రాబ్ కలిగి ఉంటుంది. వేలాడుతున్న శరీరంతో చిత్రమైన రూపం గల ఈ రకం పీతలు అత్యద్భుతమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి చిన్న చిన్న బ్యాక్టీరియాలను కూడా గుర్తిస్తుంది. అందుకే వీటిని వ్యాక్సిన్ల పరిశోధనలకు ఉపయోగపడుతుందని కనుగొన్నారు.
హార్స్ షూ పీతలు ప్రపంచంలోనే మనుగడలో ఉన్న అతి పురాతన జీవరాసులు. ఇవి 45 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నట్లు అంచనా.అట్లాంటిక్, ఇండియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో కనిపించే ఈ జీవరాసులు కొన్ని మిలియన్ జీవితాలని కాపాడటం మన అదృష్టం అని చెప్పవచ్చు.
Also Read: చెరువుల్లో ముత్యాలు పండిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..