Salt Water Fish Farming – ఉప్పు నీటిలో చేపల పెంపంకం: ఉప్పు నీటిలో పెంచేందుకు పాల చేప కట్ట చేప, కొయ్యంగ చేపల రకాలు అనువైనవి. సముద్ర తీరా ప్రాంతంలో ఉప్పు నీటిలో వీటిని పెంచవచ్చు. ఎకరా చెరువుకు 30 కి. యూరియా,20 కి. ట్రిపుల్ సూపర్ ఫాస్పెట్ 200 కి. పశువుల పేడ,400 కి. కోళ్ళ ఎరువు వాడాలి. నేల ఆమ్లా స్వభావాన్ని బట్టి తగినంత సున్నం వేయాలి. నీటి పి. హెచ్ 7.5-8.5 మధ్య ఉండాలి.
నర్సరీ చెరువులలో 8-10 సేం. మీ పొడవు పెరిగే వరకు 30-45 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు. తగ్గకుండా నీరు ఉండాలి. ఎకరా చెరువులో 4 వేల నుంచి 12 వేల చేప పిల్లలు వదిలి 8-9 నేలలు పెంచితే 1-1.5% కిలోల బరువు పెరుగుతాయి.
6-7 మసాల్లో కట్ట చేపలు 700-900 గ్రా., కొయ్యంగ చేప 500-700 గ్రా. పాల చేప 300-500 గ్రా. పెరిగితే, పండు గప్ప 8-9 మసాల్లో 1-1.5కి. బరువు పెరుగుతాయి. ఎకరాకు కొయ్యంగా పాల చేపలు 1500 కిలోలు, కట్ట చేప వేవేయ్యి కిలోల , పండు గప్ప 750 కిలోల దాకా ఉత్పత్తి అవుతుంది.
Also Read: Fish Farming: చేపల పెంపకం – సాగులో మెళుకువలు.!
మంచి నీటి చేపలు:
హెటిరోప్ నెస్టాన్ ఫాస్సిలిన్: దీని శరీరం పొడవుగా ఉండి, తోక వైపు క్రింది భాగం అనచబడినట్టు ఉంటుంది. నోరు చిన్నగా మట్టి చివరలో ఉంటుంది. నోటి చుట్టు నాలుగు జతల పొడవైన బార్బెల్స్ ఉంటాయి. దీని శరీరం పై భాగం పసుపు లేత ముదురు గోధుమ రంగులో మరియు క్రింది భాగం లేత రంగులో ఉంటుంది. ఇది సుమారు 30 సేం. మీ. వరకు పెరుగుతుంది. ఇది మంచి ఆహారపు చేప.
పంగాసియస్ పంగాసియస్: శరీరం పొడవుగా ఉండి నొక్కబడినట్లు ఉంటుంది. నోరు క్రింది వైపుగా ఉంటుంది. దీని శరీరం పై భాగం వెండి వర్ణంలో ఉంటాయి. ఇది సుమారు 120 సేం. మీ వరకు పెరుగుతుంది. ఇది మంచి ఆహారపు చేప. కాని నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.
పంగాసియాస్ సుచి: ఇది విదేశీ చేప. దీని శరీరం బూడిద వర్ణంలో ఉంటుంది. లేదా నలుపు వర్ణం లో ఉంటుంది. ఇది సుమారు 130 సేం. మీ వరకు పెరిగి 40 కిలోల వరకు తుగుతుంది. చిన్న సైజు చేపలను ఆక్వారియం లో ఆలంకారణ చేపలుగా పెంచుతారు.
Also Read: Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం