Check Tray Management: చేపలు లేదా రొయ్యలు పెంచే రైతులకి చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చెరువులో చేపలు లేదా రొయ్యలను పెంచడానికి వాటిని కొనుగోలు చేయడం నుంచి పెంచి , మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు చాలా పెట్టుబడి పెట్టాలి. ఇంత పెట్టుబడి పెట్టిన కొన్ని సార్లు వాతావరణం అనుకూలించకపోతే లేదా ఇతర కారణాల వల్ల మంచి దిగుబడి రాకపోతే రైతులు చాలా వరకు నష్టపోతారు. చేపలు లేదా రొయ్యలను చెరువులో పెంచే రైతులకి 20-30 వేలు పెట్టుబడి తగ్గించడానికి కోనసీమ రైతులు మంచి ఆలోచన చేశారు.
రైతులు చేపలు లేదా రొయ్యలని చూడానికి లేదా ధానా వేయడానికి చెరువులోకి వెళ్ళడానికి చెక్ ట్రే టేబుల్ నిర్మించుకుంటారు. ఈ చెక్ ట్రే టేబుల్ రైతులు చెక్కలతో లేదా సిమెంట్ ద్వారా కడుతారు. ఈ చెక్ ట్రే టేబుల్ ద్వారా రైతులు 4-5 అడుగులు చెరువులోకి నడుచుకుంటూ వెళ్తారు.
Also Read: Agricultural Mobile App for Farmers: రైతులు ఈ అప్ ద్వారా ఉచితంగా చాలా లాభాలు పొందవచ్చు.!

Check Tray Management
ఈ చెక్ ట్రేలో రోజు చేపలు, రొయ్యలకి కావాల్సిన దానా వేసి నీటిలోకి వేస్తారు. నీటిలో చేపలు వాటిని తింటాయి. ఈ చెక్ ట్రే టేబుల్ చెక్కలు, సిమెంట్ ద్వారా కట్టడానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. చెక్ ట్రే టేబుల్ కర్రలతో కడితే ఈ ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ఈ టేబుల్ కర్రలతో కట్టడానికి చాలా తక్కువ సమయం, ఖర్చు అవుతుంది. ఈ కర్రలని ఒక కొబ్బరి తాడుతో కట్టుకుంటే ఎక్కువ కాలం వస్తుంది. చేపలు, రొయ్యలు చెరువులో పెంచే రైతులు ఈ ఆలోచనని వాడుకుంటే పెట్టుబడిలో కొంత భాగం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Drum Water Filter: నీళ్లు తాగడానికి పొలంలో కొత్త రకం వాటర్ ఫిల్టర్.!