Dusters Uses: పొడి లేక పొడరు రూపo లోనున్న రసాయనిక పదార్థo ను నేరుగా మొక్కలపై చల్లుటకుపయోగించు పరికరo డస్టరు అంటారు. డస్టర్లు రెండు రకాలు.
చేతితో పనిచేయు డస్టరు (Hand operated duster):
· ప్లంబరు నమూనా డస్టరు (Piston type duster)
· రోటర్ డస్టర్ (Rotar duster)
A. యంత్ర సహాయముచే పని చేయించుకొను డస్టరు (Power operated duster)
చేతితో పనిచేయు డస్టరు: దీనిలో రెండు రకములైన డస్టరులు కలవు.
ప్లంబరు నమూనా డస్టరు: ఇందులో నిలువుగా నున్న సిలిండరును కలిగి ఉండి దానికి పైకి క్రిందకు కదలెడి పిస్టన్ అమర్చబడి ఉంటుంది. ఈ పిస్టను ఒక కడ్డీ ద్వారా హాండిలకు కలుపబడి ఉంటుంది. సిలిండరునకు ఒక ప్రక్కగా క్రింది భాగమున గల రంధ్రమునకు ప్లాస్టిక్ గొట్టము ఒకటి కలుపబడి ఉంటుంది, సిలిండరు అడుగు భాగమును గాజుతో తయారు చేయబడిన ఒక పాత్ర అమర్చబడి ఉంది. దీనిలో రసాయనిక పదార్థపు పొడి లేక పౌడరు పెట్టబడి ఉంటుంది. దీనిని పౌడరు గది లేక డస్టు చేంబర్ అంటారు.
Also Read: Bucket Sprayer: బకెట్ స్ప్రేయరు ఎలా పనిచేస్తుంది.!
పనిచేయు విధానo:
హాండిలో పిస్టనును పైకి క్రిందకు కదలించునప్పుడు పౌడరు గదిలోని రసాయనిక పొడి సిలిండరులోని పిస్టను అడుగు భాగమునకు చేరుతుంది. తిరిగి పిస్టను క్రిందకు కదలినపుడు అది సిలిండరునకు అమర్చిన గొట్టము ద్వారా బయటకు నెట్టబడి మొక్కలపై వెదజల్లబడు తుంది.
B. రోటర్ డస్టర్:
రోటర్ డస్టరునందు పౌడరు నుంచు పాత్ర ఫైబర్ గ్లాసుతో చేయబడి, పౌడరు చల్లెడి వ్యక్తి వీపు పై కట్టుకొనుటకు వీలుగా తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఈ పాత్రయందు పౌడరును కదిలించుటకు ఒక ఎజిటేటరు మరియు పౌడరును బయటకు తీసికొనిపోవుటకు ఒక గొట్టము కలిగి యుండి బయటికి పోవు పౌడరు పరిమాణo ను క్రమబద్దము చేసుకొనుటకు ఒక రెగ్యులేటరును కలిగి ఉంటుంది. ఈ గొట్టము ఒక ఫ్యానుకు లేక ఇంపెల్లరునకు కలుపబడి దాని చుట్టూ కేసింగు లేదా కవచము మాదిరిగా మూయబడి ఉంటుంది. ఈ ఇంపెల్లరును త్రిప్పుటకు వీలుగా ఒక హాండిలు బిగించబడి ఉంటుంది. హాండిలు త్రిప్పుట ద్వారా పౌడరు పాత్ర నుండి పౌడరు ఇంపెల్లరు వైపునకు పీల్చబడి అక్కడి నుండి దీని చార్చి గొట్టము ద్వారా బయటికి నెట్టబడుతుంది.
Also Read: Lemon Grass Spray: తోటలోని తెగుళ్ళ కోసం లెమన్ గ్రాస్ స్ప్రే