Dragon Fruit Propagation: డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రవర్థన పద్ధతులు
డ్రాగన్ ఫ్రూట్‌ను విత్తనం ద్వారా మరియు కొమ్మ కత్తెరింపుల ద్వారా కూడా ప్రవర్థన0 చేసుకోవచ్చు.ఈ రెండింటిలో కోతల ద్వారా పెంచడం అనేది సాధారణం ఇంకా సులభమైన పద్ధతి. దీని కోసం క్లాడోడ్(ఒక చదునైన కాండం) యొక్క మొత్తం భాగం లేదా 10-60 సెం.మీ పొడవుగల కటింగ్ సాధారణంగా ఉపయోగిస్తారు.
విత్తనం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పెంపకం:
డ్రాగన్ ఫ్రూట్ ను విత్తనం ద్వారా ప్రవర్థన చేయడం అనేది చాలా సులభమైన పద్ధతి .ఇందులో పర పరాగసంపర్కం జరుగుతుంది అందువలన సంతానం యొక్క నాణ్యతకు హామీ ఇవ్వలేము. అందువల్ల టైప్ చేయడం నిజం కాకపోవచ్చు. విత్తనాలను పండిన పండ్ల నుండి వేరు చేసి వాటిని బ్లాటింగ్ కాగితంపై ఉంచుతారు. అవి 3-4 రోజుల్లో మొలకెత్తుతాయి . 4-5 వారాల తరువాత వాటిని కుండలోకి మార్చాలి. ఇంకా 9-10 నెలల తరువాత మొలకలు నాటడానికి సిద్ధంగా ఉంటాయి.
Also Read: Dragon Fruit Nursery: డ్రాగన్‌ఫ్రూట్ నర్సరీ యాజమాన్యం
కట్టింగ్ల ద్వారా డ్రాగన్ ఫ్రూట్ ప్రవర్ధనం:
కాండం కట్టింగ్ల ద్వారా డ్రాగన్ ఫ్రూట్‌ను పెంచడం అనేది చాలా సులభం మరియు సాధారణంగా అనుసరించే పద్ధతి. కానీ కోతలను సేకరించే సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. కొమ్మ కత్తెరింపులను మంచి నాణ్యత ఇంకా ఆరోగ్యం ఉన్న మొక్కల నుండి సేకరించాలి కావున మంచి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. కొమ్మ కత్తెరింపులకు తెగుళ్లు మరియు వ్యాధులు లేకుండా చూసుకోవాలి. సాధారణంగా వివిధ శ్రేణి కోతల పరిమాణంతో (10-60సెం.మీ. పొడవు) ప్రవర్థన చేయవచ్చు. కానీ వర్షాధార తోటలలో ఇంకా భంజరు భంజరు భూములలో పెద్దగా ఉన్న కాయలను (30 సెం.మీ. కంటే ఎక్కువ) ఉపయోగించాలి. అందువలన మొక్కలకు కఠినమైన పరిస్థితులలో కూడా మనుగడ మంచి పెరుగుదల ఉంటుంది. కొమ్మ కత్తెరింపులను పదునైన కత్తి సహాయంతో తల్లి మొక్కల నుండి వేరు చేయాలి తరువాత కాల్స్టింగ్ చేయాలి.
కొమ్మ కత్తెరింపులను పాలిథిన్ బ్యాగుల్లో నర్సరీలో నాటడానికి ముందు, వాటిని శిలీంద్ర సంహారిణి (ఉదా. టెబుకోనజోల్) 0.1%v/v లో ముంచాలి. తరువాత నాటిన తేదీ నుండి రెండవ వారంలో కూడా బ్యాగుల లో దీనిని వేసుకోవాలి. కావున కాండం కొమ్మ కత్తెరింపులను శిలీంధ్రాల నష్టాల నుండి నివారించవచ్చు. కోతలను పాలిథిన్ సంచిలో నాటిన తర్వాత కూడా తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నర్సరీ బ్యాగులలో నీటి ఎద్దడి లేకుండా ఉంచాలి కావున కోతలు శిలీంధ్రాలు/బాక్టీరియా వ్యాధులు రాకుండా ఉంటాయి. నాటిన 10 రోజులకు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. కొన్ని కొమ్మ కత్తెరింపులలకు ఒక నెల పట్టవచ్చు లేదా నెల కంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. మొలకెత్తడం అనేది నర్సరీ పరిస్థితులు, వాతావరణం ( తేమ,ఉష్ణోగ్రత )పై ,మొక్కల పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది.కొమ్మ కత్తెరింపులను మార్పిడి ప్రధాన పొలంలోకి నర్సరీ స్థాపన రెండు-మూడు నెలల తర్వాత చేయవచ్చు.
Also Read: Dragon Fruit Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా ఏడాదికి 10 లక్షల సంపాదన