ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్ ఆద్వర్యంలో షెడ్యుల్డ్ కులాల ఉప ప్రణాళిక ద్వారా పలు పంటలలో సమగ్ర సస్య రక్షణ మరియు పోషక యాజమాన్యం పై కొత్తూరు మండలంలోని గూడూరు దత్తత గ్రామంలో రైతు శిక్షణా కార్యక్రమాన్ని 06.11.2021 నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమం వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా.బి రాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ శిక్షణలో భాగంగా పలు రకాల పంటలలో సస్య రక్షణ చర్యలు ఎలా చేపట్టాలో తెలిపారు. కంది పంటలో ఆశించే ఎండు తెగులు నివారణకు ట్రైకో డెర్మా వాడకంపై అవగాహన కల్పించారు. వరి పంటలలో ఆశించే అగ్గి తెగులు, ప్రత్తి పంటలో ఆశించే వేరుకుళ్ళు తెగులు మరియు ఆకు మచ్చల నివారణ ఎలా చేయాలో తెలిపారు. ఈ రబీ పంటలలో వరికి ప్రత్యామ్నాయ పంటలుగా పెసర ,మినుము ,పుచ్చ జాతి పంటలు,బంతి, చామంతి వంటి పంటలను చేపట్టాలని చెప్పారు.
Also Read : మిద్దె తోటలో తీగ జాతి కూరగాయలు
డా. వెంకటేశ్వర రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ కూరగాయల సాగు మీద అవగహన కల్పించారు. ప్రస్తుతం కురగాయల్లో పుచ్చ, బంతి వంటి పంటలను వేయాలని మరియు ఉల్లి, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ,బీన్స్ వంటి పంటలను సాగు చేయాలని తెలిపారు.
డా. ఉపేందర్, అసోసియేట్ ప్రొఫెసర్ పలు రకాల పంటలలో లింగాకర్షక బుట్టలు ఎలా వాడాలో తెలిపారు. కంది మరియు చిక్కుడు పంటలో ఆశించు మారుకా మచ్చల పురుగు నివారణకు వేరాజిన్ 0.4 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి వాడాలని చెప్పారు. పండు ఈగ నివారణ మామిడి పంటలో ఎలా చేయాలో తెలిపారు.
డా. శైలజ జీవన ఎరువుల ప్రాముఖ్యత వాటి ఉపయోగాలు ఏ ఏ పంటలలో ఏ విధంగా వేసుకోవాలో వివరించారు. జీవన ఎరువులు పశువుల ఎరువుతో కలిపి పంట పొలాల్లో వేయడం వలన మొక్కలకు అందుబాటులో లేని భూమిలో నిక్షిప్తమయినటువంటి పోషకాలయున నత్రజని, భాస్వరం మరియు పోటాష్ మొక్కలకు అందుతుందని తెలిపారు.
డా. శకుంతలా దేవి పంటల ధరలు పంట కోసిన తర్వాత ఎప్పుడు అమ్ముకుంటే లాభాలు వస్తాయో తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు వార్డు మెంబెర్ మరియు రైతు దాదాపు 50 మంది పాల్గొన్నారు. చివరిగా రైతులకు జీవనియంత్రణ ఎరువులు, కోరాజిన్ మందులు మరియు లింగాకర్షక బుట్టలు అందజేయడం జరిగింది.
Also Read : మేలు జాతి పశువుల్లో పిండమార్పిడి