1. పచ్చిమేత పాతర వేసుకోవడం (సైలేజి)
2. వరిగడ్డిని యూరియాతో ఊరవేయడం పచ్చిమేతను పాతర వేసుకోవడం (సైలేజి)
పచ్చిమేతలోని పోషకాలు ఎక్కువగా నష్టం కాకుండా బాగుగా జీర్ణమగునట్లు మగ్గబెట్టిన మేతనే “సైలేజి” (పాతర గడ్డి / మాగుడు గడ్డి) అని పిలుస్తారు. మంచి రకం అయిన సైలేజి బంగారు రంగులో ఉంటుంది. ఒక విధమైన పండిన సువాసన వెదజల్లుతుంది. ఇది కొద్దిగా పులుపుగా ఉన్న పశువులు బాగా తింటాయి. పచ్చిగడ్డి కంటే బాగా జీర్ణం అవుతుంది. సైలేజికి అనువు అయిన పశుగ్రాసాలుపాల దశలో కంకులు ఉన్న హైబ్రిడ్ మొక్కజొన్న (ముసక జొన్న), జొన్న, రాగి వంటి పశుగ్రాసాలు, బొబ్బర్లు, వేరుశనగ చెట్ల గడ్డి, చెరుకు సొకలు, చిలకడ దుంప (గెణుసు) తీగల రకాలు సైలేజ్ తయారు చేయడానికి పనికి వస్తాయి.
1. వృత్తాకారపు సైలో 2. గుంట సైలో 3. బంకర్ సైలో
సైలేజి కొరకు ఉత్తమం అయిన, కొద్దిగా ఎత్తులో వున్న స్థలం, వాన నీళ్ళు చేరని స్థలంను ఎంపిక చేసుకోవాలి.
వృత్తాకారపు సైలో : ఒక రోజుకు ఆవుకు 15 కిలోలు, దూడకు 5 కిలోలు సైలేజి ఇవ్వవచ్చు. వృత్తాకారపు సైలోల గోడలు రాయి లేదా ఇటుక, ఇసుక, సిమెంట్ ఉపయోగించి కట్టి లోపలి వైపు సిమెంటు, ఇసుకతో అర అంగుళం మందము ప్లాస్టరింగ్ చేయవలసి ఉంటుంది. వీటి అడుగు భాగంలో నీళ్ళు ఇంకిపోవుటకు రాయి లేదా కంకర, సిమెంటును ఉపయోగించి కట్టాలి. అన్ని వైపుల నుండి మధ్యభాగము వరకు వాలు ఏర్పరచి మధ్యభాగము రెండు, మూడు అడుగుల వెడల్పు, లోతున్న బావిని కూడా చేసుకోవాలి. సైలేజి నుండి ఊరే నీళ్ళు ఈ భాగoలో చేరును.
సైలేజి తయారు చేయు విధానం: సైలేజి తయారు చేయడానికి ఉపయెగించే మేతను కోసి పొలంలోనే ఒక రోజు అరేస్తే మంచిది. మేతను అర అంగుళం నుండి ఒక అంగుళం పొడవునకు కత్తిరించవలెను. ఆ మేతను రెండు చేతులతో బాగుగా బిగించి పట్టుకొని నిదానంగా చేతులను సడలిస్తే ఆ మేత 3-4 భాగాలు విడిపోవాలి.
పొడిపొడిగా విడిపోతే దానికి నీళ్ళు చిలకరించి సైలేజి చేయాలి. అది ముద్దగా అయితే ఆ మేతను కొంత సమయం ఆరబెట్టి తరువాత కత్తిరించవలెను. ప్రతి 6 నుండి 9 అంగుళాల తరువాత, కాళ్ళతో కాని, చిన్న సైలేజర్ల సహాయంతో మేతను తొక్కవలెను. దీని వలన మేత మధ్యలో ఉన్న గాలి బయటకు వచ్చేసి ఉత్తమమైన సైలేజి అవుతుంది. ప్రతి 100 కిలోలకు 200 గ్రాములు ఉప్పు వినియోగించవచ్చు.
సైలేజి ఉపయోగించు విధానం: మేత మాగడానికి 3 నెలలు పడుతుంది. కావలసినంత సైలేజి తీసుకొని ప్లాస్టిక్ పేపరును గాలి ఆడకుండా కప్పివేయాలి.పాలు పితికిన తరువాత సైలేజి నివ్వండి. లేదా పాలు పితుకు సమయానికి మూడు, నాలుగు గంటలు ముందుగానే సైలేజి ఇవ్వండి. లేదంటే పాలలో సైలేజి వాసన వస్తుంది.
Also Read: Fodder Cultivation: హైవే డివైడర్లపైన పశుగ్రాస సేద్యం.!
Also Watch: