Pregnant Animal Management: చూడి అంటే – పశువులు ఎదలో ఉన్నప్పుడు ఆంబోతు సంపర్కం వలన కాని, కృత్రిమ గర్భాధారణ వలన కాని అండం మరియు వీర్యకణాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడి గర్భాశయంలో పెరుగుటను చూడి అంటారు.
చూడి కాలం అంటే – సంయుక్త బీజం ఏర్పడిన దగ్గర నుండి పశువు ఈనే వరకు గల కాలాన్నే చూడి కాలం అంటారు. ఇది ఆవులలో 280 రోజులు కాగా, గేదెలలో 310 రోజుల వరకు ఉంటుంది. ఈ చూడి కాలాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి ట్రైమిస్టర్ (మొదటి 3 నెలల కాలం), రెండవ ట్రైమిస్టర్ (తరువాతి 3 నెలల కాలం), మూడవ ట్రైమిస్టర్ కాలం (చివరి మూడు నెలల కాలం). పిండం పెరుగుదల అనేది చివరి 3 నెలల కాలంలో సుమారు 70 శాతం వరకు జరుగుతుంటుంది.
చూడి పశువుల లక్షణాలు:-
. చూడి పశువులు ఎదకు రాకపోవుట.
· పొట్ట భాగంలో పరిమాణం పెరిగి ఉంటుంది.
· పొదుగు పరిమాణం పెయ్యలలో 4-5 నెలల నుండి పెరుగట ప్రారంభించును. శరీర బరువు కుడా పెరుగుతుంది.
· పాలు ఇస్తున్న పశువుల యుందు పాల దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుంటుంది.
కుడి వైపు ఉదర భాగాన్ని చేతితో తాకి, అదిమినచో దూడ తిరిగి మన చేతిని నెట్టునట్లుగా తగులుతుంది. ఈ లక్షణమును 5 వ నెల నుండి గమనించవచ్చు.

Pregnant Animal Management
Also Read: Tuberculosis Disease in Cattle: పశువులలో క్షయ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది.!
చూడి పశువులలో లోపల కనిపించు లక్షణాలు:- చేతిని పాయువు ద్వారా పెట్టి గర్భాశయాన్ని పట్టుకొని గమనించినప్పుడు పిండం వైపున ఉన్న గర్భాశయ కొమ్ము పెరిగి ఉంటుంది. పిండం లేని గర్భాశయ కొమ్ము చిన్నదిగా ఉంటుంది. గర్భాశయ గోడలు పరిమాణం పెరుగుట చేత పలుచగా ఉండ గర్భాశయ గోడను బొటన మరియు చూపుడు వేలితో మృదువుగా పట్టుకొని పైకి తేల్చినప్పుడు వేళ్ళ మధ్యన ఏదో క్రిందికి జారుతున్నట్లు అనుభవం కలుగుతుంది.
రబ్బరు సంచిలో ఉన్న నీరు పోసినప్పుడు ఎలాగైతే కదులుతుంటుందో అదే విధంగా పిండం కూడా గర్భాశయంలో కదలియాడుతుంటుంది. గర్భాశయం 4వ నెల నుండి పొట్టలోనికి జారిపోతుంది. 100వ రోజు అనగా 3.5 నెలల మాసం నుండి గర్భాశయంలోని పిండం చేతికి స్పష్టంగా తగులుట గుర్తించవచ్చు. పిండం చుట్టు ఉన్న పొరలలోని కార్పస్ లూటియంను కూడా గుర్తించవచ్చు. గర్భాశయమునకు రక్త సరఫరా చేయు మధ్య ధమని యందు రక్త సరఫరా పెరుగుట వలన ఫ్రీమటస్ను గుర్తించవచ్చు. ఫ్రిమిటస్ ద్వారా 4 వ నెల నుండే చూడిని గుర్తించవచ్చు.
చూడి పశువులకు కావలసిన స్థలం:- వీటికి 9-10 చదరపు మీటర్లు స్థలం వదలాలి. [10×10] అడుగుల వెడల్పు పొడవులు కలిగిన స్థలం వదలాలి. గుండ్రంగా వున్న షెడ్లో వుంచాలి. మేతకు, నీటికి 1 1/2 -2 మీటర్ల చదరపు స్థలం వదలాలి. ఈము దినములలో వరిగడ్డిని బెడ్డింగ్ ప్రక్క వేయాలి.వీటి షెడ్ లో గాలి, వెలుతురు వుండునట్లు చూసుకోవలెను.
చూడి పశువుల పోషణ (ఆహార సంభందిత యాజమాన్యం):-
చూడి పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డితో పాటు 2 kgల దాణా మిశ్రమం కూడా ఇవ్వాలి. దాణాలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి తో పాటు, మినరల్ మిక్షర్ను కూడా కలిపి ఇవ్వాలి. చూడి పశువులకు సమృద్ధిగా పచ్చిమేత వెయ్యాలి. చూడితో ఉన్న పశువులకు దాని శరీర పోషణకు మరియు గర్భంలోని పిండము అభివృద్ధికి అదనపు మేత మరియు దాణా అవసరం ఉంటుంది. కనుక చూడి పశువులు మంచి దూడను పెట్టి, అధిక పాలను ఇవ్వాలంటే మంచి పోషణ చాలా అవసరం. చూడి పశుపులలో ఈ విధంగా అధిక దాణాను అందించడాన్ని స్టీమింగ్ ఆఫ్ అని అంటారు.
Also Read: Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!