పశుపోషణ

హిమాచల్ ప్రదేశ్‌లో 21 కోట్లు పైగా ఖరీదు చేసే దున్నపోతు

0
Modi Buffalo

Modi Buffalo

Modi Buffalo Worth More Than Rs 21 Crore పశుపోషణపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి సుల్తాన్ దున్నపోతు గురించి తెలిసే ఉంటుంది. నూనెతో నిండిన శరీరం, మృదువైన బూడిద మరియ నలుపు రంగు, అందరిని ఆకర్షించే మెరిసే కళ్ళు సుల్తాన్ సొంతం. 21 కోట్లు విలువ చేసే ఈ దున్నపోతు వీర్యానికి ఎక్కడలేని డిమాండ్ పలుకుతుంది. సుల్తాన్ వీర్యం కోసం ముందుగానే బుకింగ్ చేసుకోవాలి అంటే సుల్తాన్ డిమాండ్ ఎంత మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారతదేశంలోనే అత్యంత తెలివి మరియు శక్తివంతమైన దున్నపోతు సుల్తాన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ దురదృష్టశావత్తు సుల్తాన్ గుండెపోటుతో మరణించింది.

Sultan Buffalo

అయితే సుల్తాన్ ని తలదన్నే దున్నపోతుని గుర్తించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో పశువుల సంత నిర్వహించారు. ఆ ప్రదర్శనలో భారతదేశంలోనే తెలివైన మరియు అత్యంత శక్తివంతమైన గేదెలను ప్రదర్శించారు. కాగా ఈ ప్రదర్శనలో అందరిని ఆకర్షించిన దున్నపోతు పేరు మోడీ. మోడీ తన యజమాని అయిన వీరేంద్ర సింగ్ కి ప్రతి సంవత్సరం కోట్లలో డబ్బు సంపాదించి పెట్టేది అంట. మోడీ గతంలో సుల్తాన్ ని కూడా ఓడించింది అని చెప్పాడు వీరేంద్ర సింగ్.

ఇంతకీ మోడీ దున్నపోతు ప్రత్యేకత ఏమిటి? What About Modi Buffalo

మోడీ దున్నపోతు Modi Buffalo 5 అడుగుల 9 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది ప్రతిరోజూ 20 రకాల ఆహారాన్ని తింటుంది. దాని సంరక్షణకు ఏటా కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఈ గేదె ప్రత్యేకతలను చూసిన కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాలా ఎంతగానో ముగ్దులయ్యారు. దాంతో మోడీని సోలన్ పశువుల సంతలో శాశ్వత విజేతగా ప్రకటించారు. అయితే ఈ గేదె వయసు కేవలం ఆరేళ్లు మాత్రమేనట. మరో విశేషం ఏంటంటే మోడీ దున్నపోతు ఏనుగుతో పోటీ పడగలదని వీరేంద్ర సింగ్ చెప్పారు.

parshottam rupala

కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ముఖ్య అతిథిగా హాజరైన సోలన్ నౌని యూనివర్సిటీలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఈ తరహా దున్నపోతు అందర్నీ ఆకట్టుకుంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరేంద్ర సింగ్ తన మోడీని శాశ్వత విజేతగా ప్రకటించినందుక చాలా సంతోషించాడు. ఇకపోతే మోడీకి రోజు స్నానం చేయించి ఆయిల్ మసాజ్ చేస్తానని చెప్పాడు. దాని తల్లి లక్ష్మి 25 లీటర్ల పాలు ఇస్తుంది. జాతీయ స్థాయి ప్రదర్శనలలో దీనిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారని వీరేంద్ర సింగ్ తెలిపారు. మొత్తంగా మోడీ ధర ఎంతంటే..21 కోట్ల పైమాటే

Modi Buffalo Worth

Leave Your Comments

ఖమ్మం మిర్చి రైతుకు తీరని నష్టం

Previous article

తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ రచ్చబండ తేదీలు ఇవే..

Next article

You may also like