Poultry Management: వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది, అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు రైతులు కోళ్ల ఫారాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు చర్యలు గురించి తెలుసుకుందాం. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం చేపట్టిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చు
వర్షాకాలంలో కోళ్ల సంరక్షణ
వర్షాకాలం మొదలైంది.. అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో వినియోగదారులు బెంబేలు ఎత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చికన్, గ్రుడ్డు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వర్షాలు వల్లన కోళ్లలో జాగ్రత్తలు తీసుకోకపోతే పలు వ్యాధులకు గురి అయ్యే అవకాశం ఉంది. దీంతో గుడ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అది రోగాల బారిన పడి మరణిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ల పరిశ్రమపై అధిక దృష్టి పెట్టాలి.. అప్పుడే మాంసం రేట్లు కూడా తగ్గకుండా ఉంటాయి.
Also Read: Orchid Floriculture: పాలీహౌస్ లో ఆర్కిడేసి పూల పెంపకం 20 లక్షల లాభం.!
బ్రూడింగ్ దశ నుండే ఉష్ణోగ్రతలు
కోళ్ల పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి.. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుండి ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి తగు చర్యలు తీసుకోవాలి. కోళ్లకు అవసరమైన ముడిసరుకులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు సకాలంలో వేయించాలి. షెడ్లలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వర్షపు జల్లులు పడకుండా వెంటిలేటర్లకు గొనె సంచులు కట్టాలి. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఎప్పటికప్పుడు దాణా నమూనాలను పరీక్షిస్తూ ఉండాలి. లిట్టల్ లో తేమ శాతం పెరగకుండా చూసుకోవాలి. వర్షాకాలం రాకముందే టీకాలు ఇచ్చినట్లయితే కొంత మేర వ్యాధులు తగ్గించుకోవాలి. అప్పుడే మనం కోళ్ల పరిశ్రమను కాపాడుకోవచ్చు.
Also Read: Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!